జయరాం హత్య కేసు... విచారణకు మళ్లీ వచ్చిన పింగ్ పాంగ్..!

పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు మరింత లోతుగా విచారించడం ప్రారంభించారు. ప్రధాన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను కస్టడీకి తీసుకొని విచారించి ఆ తర్వాత వారికి సహకరించారనే ఆరోపణలు ఉన్న తెలంగాణ పోలీసు అధికారులను కూడా సుదీర్ఘంగా విచారించారు. ఇక ఈ హత్య సమయంలో రాకేష్‌రెడ్డితో టచ్‌లో ఉన్న పలువురు పేర్లు తెరపైకి రావడంతో పాటు కాల్‌లిస్ట్‌లో ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కాగా, జయరాంను రాకేష్‌రెడ్డి […]

Advertisement
Update:2019-02-23 02:07 IST

పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు మరింత లోతుగా విచారించడం ప్రారంభించారు. ప్రధాన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను కస్టడీకి తీసుకొని విచారించి ఆ తర్వాత వారికి సహకరించారనే ఆరోపణలు ఉన్న తెలంగాణ పోలీసు అధికారులను కూడా సుదీర్ఘంగా విచారించారు.

ఇక ఈ హత్య సమయంలో రాకేష్‌రెడ్డితో టచ్‌లో ఉన్న పలువురు పేర్లు తెరపైకి రావడంతో పాటు కాల్‌లిస్ట్‌లో ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కాగా, జయరాంను రాకేష్‌రెడ్డి ఇంటికి తీసుకొని వచ్చింది సినీ కమేడియన్ సూర్యప్రసాద్ అలియాస్ పింగ్‌పాంగ్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూర్యను ఇప్పటికే విచారించిన పోలీసులు మరో దఫా విచారణకు పిలిచారు.

రాకేష్‌రెడ్డి చెప్పినంత మాత్రాన సూర్య ఎందుకు కారులో జయరాంను తీసుకొని వచ్చాడని..? సూర్య కావాలనే చేశాడా లేదా మరో కోణం ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఒక సినిమాకు రాకేష్ ఫైనాన్స్ చేస్తానన్నాడని.. దానికి సంబంధించిన డబ్బులు తీసుకోవడానికే వెళ్లానని సూర్య చెబుతున్నాడు.

ఇద్దరిని విచారించిన పోలీసులు మరోసారి సూర్య వెర్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న శిఖా చౌదరిని కూడా పోలీసులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News