తోట ఖాయం.... మోదుగులకు న్యాయం

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖయమైంది. గడచిన పదిరోజులుగా తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్, ఆమంచి క్రిష్ణమోహన్, తోట త్రిమూర్తులకు ఆప్తమిత్రులు. వారిద్దరి రాయబారంతోనే తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్ సీపీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తోట త్రిమూర్తులను పిలిపించి మాట్లడారు. ఆ […]

Advertisement
Update:2019-02-22 08:18 IST

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖయమైంది. గడచిన పదిరోజులుగా తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్, ఆమంచి క్రిష్ణమోహన్, తోట త్రిమూర్తులకు ఆప్తమిత్రులు. వారిద్దరి రాయబారంతోనే తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్ సీపీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తోట త్రిమూర్తులను పిలిపించి మాట్లడారు. ఆ భేటీ తర్వాత తోట త్రిమూర్తులు పార్టీ మారడం లేదంటూ ప్రకటన చేసారు.

ఇది జరిగిన రెండు రోజులకే తెలంగాణ మంత్రి, తన మిత్రుడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తోట త్రిమూర్తులు హైదారబాదులో కలుసుకున్నారు. ఈ భేటీలోనే తోట త్రిమూర్తులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారు అయ్యిందని అంటున్నారు. అంత వరకూ తోట త్రిమూర్తులు పార్టీ మారరంటూ ప్రకటనలు చేసిన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప వీరి భేటీ తర్వాత త్రిమూర్తులు విషయం పార్టీ చూసుకుంటుందని ప్రకటించారు.

దీంతో త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయం అయింది. ఇక మరో సీనియర్ నేత మోదుగుల కూడా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తోను, ఇతర సీనియర్ నాయకులతోను మాట్లాడినట్లు చెబుతున్నారు. ఆయనకు ఇదిమిత్తంగా ఫలాన సీటు కేటాయిస్తామని స్పష‌్టమైన హామీ ఇవ్వనప్పటికీ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవ ప్రదమైన స్దానాన్ని కల్పిస్తామని జగన్ హమీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

తాను చంద్రబాబు నాయుడి లాంటి మనిషిని కానని, ఒక్కసారి వాగ్దానం చేస్తే ఎట్టి పరిస్దితులలోను నెరవేరుస్తానని మోదుగులకు జగన్ స్పష్టమైన హమీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరు నాయకులు తెలుగుదేశం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News