చంద్రబాబు ద్రోహే... బహిరంగ సభలోనూ నిరూపిస్తా " యార్లగడ్డ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై భాషాప్రియులు కూడా ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషకు కూడా వెన్నుపోటు పొడిచారని మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మండిపడ్డారు. చంద్రబాబు ముమ్మాటికి తెలుగు భాష ద్రోహి అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చంద్రబాబు ద్రోహి కాదు అని ఎవరైనా అంటే వారితో బహిరంగ చర్చకు సిద్ధమని… ఆ చర్చలోనే చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిరూపిస్తానని సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరి చేస్తామని చంద్రబాబు చెప్పింది […]

Advertisement
Update:2019-02-21 02:22 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై భాషాప్రియులు కూడా ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషకు కూడా వెన్నుపోటు పొడిచారని మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మండిపడ్డారు. చంద్రబాబు ముమ్మాటికి తెలుగు భాష ద్రోహి అని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో చంద్రబాబు ద్రోహి కాదు అని ఎవరైనా అంటే వారితో బహిరంగ చర్చకు సిద్ధమని… ఆ చర్చలోనే చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిరూపిస్తానని సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరి చేస్తామని చంద్రబాబు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు.

గోదావరి పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరంలో తెలుగు వర్శిటీ ఏర్పాటు చేస్తానని చెప్పి… ఆ విషయాన్నే మరిచిపోయిన వ్యక్తి చంద్రబాబు అని యార్లగడ్డ ఫైర్ అయ్యారు.

బొమ్మూరు తెలుగుపీఠం భూములను ఎవరికో కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని… పీఠం భూముల్లో ఒక్క గజం
అన్యాక్రాంతం అయినా సరే తాను ఆమరణ దీక్ష చేస్తానని యార్లగడ్డ హెచ్చరించారు. చాలా విషయాల్లో చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరే బాగుందని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News