రాబోయే ప్రభుత్వానికి ఆర్ధిక గుదిబండగా చంద్రబాబు

ఎన్నికలలో విజయం సాధించడానికి, అధికారంలోకి రావడానికి ఎవ్వరైనా ఎలాంటి హామీలైనా గుప్పించ వచ్చు. అది ప్రజాస్వామ్యంలో నేరం కాదు. పైగా భారత దేశం లాంటి దేశంలో వాటికి ఆంక్షలు కూడా ఉండవు. అయితే హామీలు గుప్పించే ముందు వాటిని బహిరంగంగా ప్రకటించే ముందు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని…. తానే దేశంలోకెల్లా సీనియర్ రాజకీయ నాయకుడనని పదే పదే ప్రకటించుకునే చంద్రబాబు నాయుడు మాత్రం […]

Advertisement
Update:2019-02-21 06:55 IST

ఎన్నికలలో విజయం సాధించడానికి, అధికారంలోకి రావడానికి ఎవ్వరైనా ఎలాంటి హామీలైనా గుప్పించ వచ్చు. అది ప్రజాస్వామ్యంలో నేరం కాదు. పైగా భారత దేశం లాంటి దేశంలో వాటికి ఆంక్షలు కూడా ఉండవు. అయితే హామీలు గుప్పించే ముందు వాటిని బహిరంగంగా ప్రకటించే ముందు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుంది.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని…. తానే దేశంలోకెల్లా సీనియర్ రాజకీయ నాయకుడనని పదే పదే ప్రకటించుకునే చంద్రబాబు నాయుడు మాత్రం ఎల్లలు లేని హామీలను గుప్పిస్తున్నారు. పైగా ఈ హామీలను తన ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పకుండా ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం జూన్‌ నెలలో వీటిని అమలు చేస్తుందంటూ ప్రకటిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతి. ఎన్నికలు రెండు మూడు నెలలలో ఉన్నాయనగా ఉద్యోగులను మభ్య పెట్టేందుకు వారి ఓట్లను కొల్లగొట్టేందుకు మధ్యంతర భృతిని ప్రకటించారు. ఇది కూడా ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే ప్రభుత్వం జూన్‌ నెల నుంచి ఇస్తుందని ప్రకటించారు. అత్త సొమ్మును అల్లుడు దానం చేయడం అంటే ఇదే. ఈయన హామీలు, జీవోలు ఇస్తాడు… డబ్బు మాత్రం రాబోయే ప్రభుత్వం ఇవ్వాలని చెబుతాడు.

ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారో తెలియదు. ఆయన అధికారంలోకి వస్తారని అసలే నమ్మకం లేదు. అలాంటిది ఈ మూడు నెలల కాలానికి ఉద్యోగులను మభ్య పెట్టడం దారుణమని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
రాష్ట్రానికి ఆర్ధిక గుదిబండగా మారడం చంద్రబాబుకు కొత్త కాదని ఆర్దిక విశ్లేషకులు మండిపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాల తీయించిన చంద్రబాబు నాయుడు కొన్నాళ్ల పాటు బ్యాంకుల ఓడీల మీదే కాలం గడిపారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆర్ధిక మంత్రి రోశయ్య రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్ది రాష్ట్రాన్ని ఓవర్ డ్రాఫ్ట్ గుదిబండ నుంచి బయట పడేసారు.

ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ లతో పాలన సాగిస్తూ తిరిగి రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టేస్తున్నారు. ఈ ఆర్ధిక భారం చాలదన్నట్లుగా అన్ని వర్గాల ఓట్లను కొల్లగొట్టి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారు. చివరకు విద్యార్ధులను కూడా మోసం చేసే క్రమంలో ఫీజు రీయంబర్స్ మెంట్ ను కూడా వచ్చే ఏడాది నుంచి 35 వేల నుంచి 45 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాల్సింది రాబోయే ప్రభుత్వం. ఎన్నిక కాబోయే ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు పడేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే వచ్చే ప్రభుత్వం తనది కాదని చంద్రబాబు గట్టి నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. అందుకే వాళ్ళమీద కసి తీర్చుకునేలా ఆర్ధిక పరిస్థితిని గందరగోళం చేస్తున్నాడని ప్రతిపక్షాలంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News