జగన్‌ అలా చేస్తే నేను కూడా ఆయన వెంటే " నటుడు సుమన్

ఏలూరు బీసీ గర్జన సభలో వైసీపీ చేసిన బీసీ డిక్లరేషన్‌పై నటుడు సుమన్ స్పందించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన…బీసీ గర్జనలో చెప్పిన విషయాలను ఆచరణలోకి తెస్తే బీసీలంతా జీవితాంతం జగన్‌ వెంటే నడుస్తారని సుమన్ అభిప్రాయపడ్డారు. అలా నడిచే వారిలో తాను కూడా ఉంటానన్నారు. చెప్పినవన్నీ నెరవేర్చాలంటే చాలా ధైర్యం ఉండాలన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన బాగుంది కాబట్టే ఎన్నికలకు ముందే అక్కడ టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పగలిగానన్నారు. ఏపీలో పరిస్థితులపై ఇప్పుడే తానేమీ మాట్లాడలేనన్నారు. ఎన్నికల ముందు […]

Advertisement
Update:2019-02-21 05:10 IST

ఏలూరు బీసీ గర్జన సభలో వైసీపీ చేసిన బీసీ డిక్లరేషన్‌పై నటుడు సుమన్ స్పందించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన…బీసీ గర్జనలో చెప్పిన విషయాలను ఆచరణలోకి తెస్తే బీసీలంతా జీవితాంతం జగన్‌ వెంటే నడుస్తారని సుమన్
అభిప్రాయపడ్డారు. అలా నడిచే వారిలో తాను కూడా ఉంటానన్నారు. చెప్పినవన్నీ నెరవేర్చాలంటే చాలా ధైర్యం ఉండాలన్నారు.

ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన బాగుంది కాబట్టే ఎన్నికలకు ముందే అక్కడ టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పగలిగానన్నారు. ఏపీలో పరిస్థితులపై ఇప్పుడే తానేమీ మాట్లాడలేనన్నారు. ఎన్నికల ముందు తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెబుతానన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు మార్పు కోరుకోవడం సహజమన్నారు. సొంత కులం మీద అభిమానం ఉండడంలో తప్పులేదని… అదే సమయంలో ఇతర కులాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతపురం జిల్లాతో తొలి నుంచి తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ఇక్కడి తన స్నేహితులు శివశంకర్ రెడ్డి, హరీష్‌ రెడ్డిలు సొంత మనిషిలా చూసుకుంటారని చెప్పారు. అందుకే తాను అనంతపురం వస్తే వారి వద్దే ఉంటానని సుమన్
వివరించారు.

Tags:    
Advertisement

Similar News