క్రిమినల్స్‌ అంటే అర్థం ఏమిటి బాబు?

అసహనం తారాస్దాయికి చేరినప్పుడు మాటలు అదుపులో ఉండవు అనడానికి నిదర్శనం ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రకటనలే. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు క్యూకట్టి ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిందని పార్టీ నాయకులు చెప్తున్నారు. రాజకీయ పార్టీకి చెందిన నాయకులే కాకుండా సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలవడంతో నారా చంద్రబాబు నాయుడిలో […]

Advertisement
Update:2019-02-21 05:18 IST

అసహనం తారాస్దాయికి చేరినప్పుడు మాటలు అదుపులో ఉండవు అనడానికి నిదర్శనం ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రకటనలే. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు క్యూకట్టి ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిందని పార్టీ నాయకులు చెప్తున్నారు.

రాజకీయ పార్టీకి చెందిన నాయకులే కాకుండా సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలవడంతో నారా చంద్రబాబు నాయుడిలో కోపం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ఆయన మాటలు ఆయన అసహనాన్ని తెలియజేస్తున్నాయి.

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహాన్ రెడ్డిని ఆయన నివాసం లోటస్‌పాండ్‌లో కలుసుకున్నారు. వారిద్దరూ అరగంట సేపు చర్చలు జరిపారు. ఆ చర్చల సారం ఏమిటో వారిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు. నాగార్జున గుంటూరు నుంచి పోటీ చేసేందుకు జగన్‌ను కలిసారని మీడియాలో వార్తలు వచ్చాయి.

వెంటనే ఈ కలియకను గుంటూరు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌ రాజకీయ పరమైనది కాదని ప్రకటించారు. అంతవరకూ అది సబబుగానే ఉంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు మాత్రం హీరోలు క్రిమినల్స్‌ను ఎలా కలుస్తారంటూ ప్రశ్నించారు.

అంతేకాదు విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిన చంద్రబాబు హీరోలు జగన్‌ను కలవడాన్ని నైతిక విలువలు లేకపోవడంగా అభివర్ణించారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్షాలే కాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా నవ్వుకుంటున్నారని, ఆ పార్టీవారే అంటున్నారు. పక్కనే కాల్ మనీ రాకెట్ నేరగాళ్ళను, అంతర్జాతీయ ఆర్ధిక నేరగాళ్ళను, బ్యాంకులకు టోపీ పెట్టిన వాళ్ళను, అనేక హత్యలతో సంబంధం ఉండేవాళ్ళను…. వీళ్ళందరినీ మించి చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని చంద్రబాబు ఇతరులను క్రిమినల్స్ అనడం ఏమిటో అర్థం కావడం లేదని తెలుగుదేశం వాళ్ళే విమర్శిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే ఎలాంటి క్రిమినల్ పనులు చేశాడో ఆయన తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన పుస్తకంలో రాశాక కూడా ఇంకా చంద్రబాబు గురివింద లాగా నీతులు మాట్లాడడం ఏమిటో అని విమర్శకులంటున్నారు.

Tags:    
Advertisement

Similar News