పాకిస్థాన్ పై జింబాబ్వే ఘన విజయం
80 పరుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే
వన్‌డే క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ జట్టును జింబాబ్వే చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ లో పర్యటిస్తున్న జింబాబ్వే ఆదివారం బులవాయోలో ఫస్ట్ వన్ డే మ్యాచ్ లో తలపడింది. టాస్ గెలిచిన పాక్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 206 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన పాకిస్థాన్ 21 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసింది. ఆ దశలో వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. డక్‌వర్త్ లూయిస్ మెథడ్‌లో జింబాబ్వే టీమ్ 80 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. జింబాబ్వే జట్టులో రిచర్డ్ నగరవ 48, సిఖిందర్ రజా 39, మరుమాణి 29, సీన్ విలియమ్స్ 23 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ ఆఘా, ఫైజల్ అక్రమ్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ 19, కమ్రాన్ గులామ్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, విలియమ్స్, సికిందర్ రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. మూడు వన్‌డేల సిరీస్‌లో జింబాబ్వే 1-0 తేడాతో లీడ్ లో ఉంది. ఈనెల 26, 28 తేదీల్లో తదుపరి మ్యాచ్‌లు జరగనున్నారు.