భోపాల్‌ దుర్ఘటన: 875 శవపరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ ఏమన్నారంటే?

ప్రమాదం జరిగిన రోజు భోపాల్‌ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతిగా ఉన్న డాక్టర్‌ డీకే సత్పతి కీలక అంశాల వెల్లడి

Advertisement
Update:2024-11-24 19:09 IST

నలభై ఏళ్ల కిందట మధ్యప్రదేశ్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన విష వాయువులు కనీవినీ ఎరుగని విషాదాన్నిమిగిల్చింది. భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబర్‌ 2న అర్ధరాత్రి విష వాయువులు లీకయ్యాయి. ఆ దుర్ఘటనలో 3787 మంది మృతి చెందగా.. సుమారు 5 లక్షల మంది ప్రభావితమయ్యారు. దాని బాధితులు ఇంకా పోరాటం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన రోజు భోపాల్‌ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతిగా ఉన్న డాక్టర్‌ డీకే సత్పతి కీలక అంశాలు వెల్లడించారు. భోపాల్‌ దుర్ఘటన బాధిత సంఘాలు తాజాగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఆ దుర్ఘటన జరిగిన రోజే 875 శవపరీక్షలు నిర్వహించారు. అంతేగాకుండా ఐదేళ్లలో దాదాపు 18 వేల మంది బాధితుల శవ పరీక్షలకు సాక్షిగా మిగిలిన ఆయన ఇప్పటికీ పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

డాక్టర్‌ సత్పత్తి మాట్లాడుతూ.. ఐదేళ్లలో నుంచి బైటపడిన వారి తర్వాతి తరాల్లోనూ ఆ విషవాయువుల ప్రభావం కనిపించిందన్నారు.ఆ ప్రమాదం నుంచి బైటపడిన మహిళలకు పుట్టబోయే ప్రభావం గురించి లేవనెత్తిన ప్రశ్నలను యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ ఖండించిందన్నారు. దీని ప్రభావాలు గర్భంలోని బిడ్డపై చూపవని చెప్పిందన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గర్భిణుల రక్త నమూనాలను పరీక్షించగా.. తల్లిలో కనిపించిన 50 శాతం విష పదార్థాలు కడుపులో ఉన్న బిడ్డలోనూ ఉన్నట్లు తేలాయన్నారు. ప్రాణాలతో బైట పడిన మహిళలకు పుట్టిన చిన్నారుల్లోనూ విషపూరిత రసాయనాల ఆనవాళ్లు కనిపించాయి. తర్వాతి తరం ఆరోగ్యంపైనా అవి ప్రభావం చూపాయి. దీనిపై నిర్వహించిన పరిశోధనలను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథైల్‌ ఐసోసైనేట్‌ గ్యాస్‌ నీటిలో కలవడంతోనే అనేక విషయవాయులు ఏర్పడ్డాయి. అవి క్యాన్సర్‌, కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమయ్యాయి అని తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News