మోసం చంద్రబాబు ప్రవృత్తి " అమిత్ షా
గత ఎన్నికల్లో మోడీ ఇమేజ్ సాయంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. కాంగ్రెస్, చంద్రబాబులు పాకిస్తాన్‌ను సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన అమిత్ షా… సైనికులపై ఉగ్రవాడిని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు. చంద్రబాబు పాక్ ప్రధానిని సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు పాకిస్థాన్ ప్రధానిపై నమ్మకం ఉంది గానీ… భారత ప్రధానిపై మాత్రం నమ్మకం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఇంతగా దిగజారిపోతారనుకోలేదన్నారు. చంద్రబాబు కర్నాటక, బెంగాల్, ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేస్తున్నారని… కానీ ఆయన ధర్నాలు చేయాల్సింది పక్క […]
గత ఎన్నికల్లో మోడీ ఇమేజ్ సాయంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. కాంగ్రెస్, చంద్రబాబులు పాకిస్తాన్‌ను సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన అమిత్ షా… సైనికులపై ఉగ్రవాడిని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు.
చంద్రబాబు పాక్ ప్రధానిని సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు పాకిస్థాన్ ప్రధానిపై నమ్మకం ఉంది గానీ… భారత ప్రధానిపై మాత్రం నమ్మకం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఇంతగా దిగజారిపోతారనుకోలేదన్నారు.
చంద్రబాబు కర్నాటక, బెంగాల్, ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేస్తున్నారని… కానీ ఆయన ధర్నాలు చేయాల్సింది పక్క రాష్ట్రాల్లో కాదని… టీడీపీ కార్యాలయం ముందే ధర్నా చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను వంచించినందుకు టీడీపీ కార్యాలయం ముందు చంద్రబాబు ధర్నాకు కూర్చోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ముంచిన కాంగ్రెస్‌తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు.
టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలు అని అమిత్ షా విమర్శించారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన లేదన్నారు. మోసం చేయడం చంద్రబాబు ప్రవృత్తి అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్టీఆర్ ని ఆ తర్వాత వాజ్‌పేయిని ఇప్పుడు మోడీని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ సమాధి తానే కట్టుకుంటున్నారని
వ్యాఖ్యానించారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు.