మీకెందుకు రా రాజకీయం.... పిచ్చముండా కొడకల్లారా " దళితులపై చింతమనేని

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి బహిరంగంగానే దళితులను అనరాని మాటలు అన్నారు. ఆ మాటల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో చింతమనేని చేసిన వ్యాఖ్యల వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్యక్రమంలో ఓ దళితుడు తాను మాట్లాడుతానని, మైక్ ఇవ్వాలని కోరగానే చింతమనేనికి కోపం వచ్చింది. అసభ్య పదాలతో విరుచుకుపడ్డారు. వీడూ మాట్లాడుతానంటున్నాడు అంటూ చింతమనేని ఫైర్ అయ్యారు. ‘రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు […]

Advertisement
Update:2019-02-20 02:00 IST

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి బహిరంగంగానే దళితులను అనరాని మాటలు అన్నారు. ఆ మాటల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో చింతమనేని చేసిన వ్యాఖ్యల వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కార్యక్రమంలో ఓ దళితుడు తాను మాట్లాడుతానని, మైక్ ఇవ్వాలని కోరగానే చింతమనేనికి కోపం వచ్చింది. అసభ్య పదాలతో విరుచుకుపడ్డారు. వీడూ మాట్లాడుతానంటున్నాడు అంటూ చింతమనేని ఫైర్ అయ్యారు. ‘రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా ….’ అంటూ చింతమనేని దళితులను దూషించాడు.

చింతమనేని వీడియో వైరల్ అవడంతో కలకలం రేగింది. చింతమనేని వ్యాఖ్యల నేపథ్యంలో దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను… దళితులు శుభ్రంగా ఉండరు… చదువు రాకపోయినా పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నారంటూ మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News