ఉగ్రదాడి వెనుక తమ ప్రమేయం లేదని పాక్ కూడా చెప్పింది

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుల్వామా ఘటనపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. పుల్వామా ఘటన కేంద్రానికి తెలిసే జరిగిందని… రాజకీయ లబ్ది కోసం మోడీ ఏమైనా చేస్తారని మంగళవారం వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు మరో అడుగు ముందుకేశారు. రోజూ తరహాలోనే ఉదయమే పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… పుల్వామా ఘటనపై మరోసారి స్పందించారు. పుల్వామా ఘటనలో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్‌ స్పష్టంగా చెప్పిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాక్‌ ప్రకటన నేపథ్యంలో ఈ ఘటన వెనుక రాజకీయ లబ్ది దాగి ఉందన్న అనుమానం దేశ వ్యాప్తంగా బలపడుతోందన్నారు చంద్రబాబు.  […]

Advertisement
Update:2019-02-20 03:29 IST

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుల్వామా ఘటనపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. పుల్వామా ఘటన కేంద్రానికి తెలిసే జరిగిందని… రాజకీయ లబ్ది కోసం మోడీ ఏమైనా చేస్తారని మంగళవారం వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు మరో అడుగు ముందుకేశారు. రోజూ తరహాలోనే ఉదయమే పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… పుల్వామా ఘటనపై మరోసారి స్పందించారు.

పుల్వామా ఘటనలో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్‌ స్పష్టంగా చెప్పిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాక్‌ ప్రకటన నేపథ్యంలో ఈ ఘటన వెనుక రాజకీయ లబ్ది దాగి ఉందన్న అనుమానం దేశ వ్యాప్తంగా బలపడుతోందన్నారు చంద్రబాబు.
కేంద్రంలో ఉన్న వారు స్వార్థం కోసం దేశాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తామంటే అంగీకరించబోనన్నారు.

ఉగ్రదాడి చేసిన వ్యక్తి దాడికి ముందుకు స్వయంగా వీడియో విడుదల చేశాడు…. దాడి తామే చేశామని జైషే ఏ మహ్మద్ సంస్థ ప్రకటించింది. అయినా బాబు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. పాక్‌ ఇప్పుడే కాదు గతంలో కసబ్ బృందం ముంబైపై దాడి చేసినప్పుడు కూడా తమకు సంబంధం లేదనే
వాదించింది.

ఇప్పుడు జరిగిన దాడి వెనుక తమ ప్రమేయం లేదని పాకిస్థాన్‌ చెప్పిందని చంద్రబాబు గుర్తు చేయడం, ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేయడం బట్టి చంద్రబాబు ఉద్దేశం ఏంటో?. ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో!.

Tags:    
Advertisement

Similar News