జగన్‌తో భేటీ అయిన నాగార్జున.... గుంటూరు టికెట్ కోసమేనా?

సినీ హీరో అక్కినేని నాగార్జున కొద్ది సేపటి క్రితం లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. జగన్, నాగార్జున మధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. కాగా, గత కొంత కాలంగా నాగార్జున గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండే నాగార్జున ఇక్కడి రాజకీయాల్లో మాత్రం వేలుపెట్టలేదు. అంతే కాకుండా తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని కూడా పలుమార్లు చెప్పారు. కాని […]

Advertisement
Update:2019-02-19 11:28 IST

సినీ హీరో అక్కినేని నాగార్జున కొద్ది సేపటి క్రితం లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. జగన్, నాగార్జున మధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. కాగా, గత కొంత కాలంగా నాగార్జున గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండే నాగార్జున ఇక్కడి రాజకీయాల్లో మాత్రం వేలుపెట్టలేదు. అంతే కాకుండా తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని కూడా పలుమార్లు చెప్పారు. కాని గత కొంత కాలంగా మాత్రం ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం మాత్రం సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.

దాదాపు అరగంట సేపు ఇరువురూ ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. తన రాజకీయ రంగప్రవేశంపై కూడా నాగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే భేటీ ముగిసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

Tags:    
Advertisement

Similar News