వన్డే ప్రపంచకప్ కు 100 రోజుల కౌంట్ డౌన్

మే 30 నుంచి జులై 14 వరకూ 2019 ప్రపంచకప్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా 48 మ్యాచ్ లతో ప్రపంచకప్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ దేశాల ఆతిథ్యంలో జరిగే 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు… 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మే నెల 30 నుంచి జులై 14 వరకూ… ఇంగ్లండ్, వేల్స్ దేశాలలోని 11 వేదికల్లో మొత్తం 48 మ్యాచ్ లుగా ప్రపంచకప్ ను నిర్వహించడానికి ఐసీసీ విస్త్రృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. […]

Advertisement
Update:2019-02-18 13:54 IST
  • మే 30 నుంచి జులై 14 వరకూ 2019 ప్రపంచకప్
  • ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా 48 మ్యాచ్ లతో ప్రపంచకప్

ఇంగ్లండ్ అండ్ వేల్స్ దేశాల ఆతిథ్యంలో జరిగే 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు… 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

మే నెల 30 నుంచి జులై 14 వరకూ… ఇంగ్లండ్, వేల్స్ దేశాలలోని 11 వేదికల్లో మొత్తం 48 మ్యాచ్ లుగా ప్రపంచకప్ ను నిర్వహించడానికి ఐసీసీ విస్త్రృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది.

రెండుదశాబ్దాల విరామం తర్వాత ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ఈ పోటీలను గ్రూప్ లీగ్ కమ్ సెమీ ఫైనల్స్ నాకౌట్ గా నిర్వహించనున్నారు. ప్రపంచక్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జులై 14న టైటిల్ సమరం జరుగనుంది.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ఆస్ట్రేలియా ఐదుసార్లు టైటిల్ విన్నర్ గా నిలిస్తే… భారత్ 1983, 2011 టోర్నీలలో చాంపియన్ గా ఉంది. గత ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా ఐదోసారి ప్రపంచకప్ అందుకొన్న ఆస్ట్రేలియాతో పాటు టీమిండియా, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు దిగుతున్నాయి.

ఆస్ట్రేలియా, టీమిండియా, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, విండీస్ జట్లు గ్రూప్ లీగ్ దశలో తలపడనున్నాయి.

ఫిబ్రవరి 19 నుంచి…. ఐసీసీ సభ్యదేశాలతో పాటు…. అనుబంధం హోదా పొందిన దేశాలలో సైతం 100 రోజుల కౌంట్ డౌన్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారు.

Tags:    
Advertisement

Similar News