గర్జనతో ఫ్యాన్ జోష్....
ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగ సభ, సదస్సు, భారీ సమావేశం నిర్వహించి అది విజయవంతమైతే ఆ పార్టీ వారికి వచ్చే ఆనందమే వేరు. అలాగే ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఎదుటి వారి విజయం ఓ విషాదమే. అలా ఆనంద పడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే… విషాదంలో మునిగి తేలుతున్న పార్టీ మాత్రం అధికార తెలుగుదేశం. పట్టుమని పది రోజులు కూడా కాకుండా పక్క జిల్లాలో అధికార బలంతో నిర్వహించిన బీసీ సదస్సు ఇచ్చిన […]
ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగ సభ, సదస్సు, భారీ సమావేశం నిర్వహించి అది విజయవంతమైతే ఆ పార్టీ వారికి వచ్చే ఆనందమే వేరు. అలాగే ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఎదుటి వారి విజయం ఓ విషాదమే. అలా ఆనంద పడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే… విషాదంలో మునిగి తేలుతున్న పార్టీ మాత్రం అధికార తెలుగుదేశం.
పట్టుమని పది రోజులు కూడా కాకుండా పక్క జిల్లాలో అధికార బలంతో నిర్వహించిన బీసీ సదస్సు ఇచ్చిన ఆనందం తెలుగుదేశం పార్టీలో ఆవిరైపోయింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా బీసీల సదస్సు నిర్వహించింది. అధికారం వారి చేతిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు.
ఆ వరాల జల్లుల తడి ఆరకముందే ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ప్రతిపక్ష వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజమహేంద్రవరం లో జరిగిన ప్రభుత్వ సదస్సుకు వచ్చిన సంఖ్య కంటే నాలుగింతలు ఎక్కువమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బిసి గర్జనకు హాజరయ్యారు అని ఓ అంచనా.
అలాగే, గర్జనలో ప్రసంగించిన వైయస్ జగన్ ఇస్తున్న హామీలకు, చేస్తున్న విమర్శలకు సభికుల నుంచి ఎంతో ప్రోత్సాహం లభించింది. ఈ ప్రోత్సాహం చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్యాన్ స్పీడు పదింతలు పెరుగుతుందని సంబరాలు చేసుకుంటున్నారు.
జగన్ ప్రసంగం అనంతరం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వేదిక పైనే జగన్ ను అభినందించారు. బీసీ గర్జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదే బీసీ గర్జన తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. తమ పాలన పై ప్రజల్లో…. ముఖ్యంగా బీసీల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని తెలుగుదేశం నాయకులు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు.