పాకిస్థాన్ కోడలిగా సానియా కష్టాలు
పుల్వామా ఉగ్రదాడితో సానియా అయోమయం సానియా బ్రాండ్ అంబాసిడర్ హోదా తొలగించాలంటూ డిమాండ్ దేశభక్తిని పదేపదే చాటుకోవాల్సిన పనిలేదంటున్న సానియా ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్న సామెత… భారత టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జా మాలిక్ కు అతికినట్లు సరిపోతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడిన ప్రతీసారీ… రాజాసింగ్ లాంటి బీజెపీ నాయకులు… సానియాను పరోక్షంగా దెప్పి పొడవటం, తమ వ్యాఖ్యలతో సానియా సహనానికి పరీక్ష పెట్టడం ఓ అలవాటుగా మారింది. విమర్శలకు కేంద్రబిందువుగా…. భారత టెన్నిస్ […]
- పుల్వామా ఉగ్రదాడితో సానియా అయోమయం
- సానియా బ్రాండ్ అంబాసిడర్ హోదా తొలగించాలంటూ డిమాండ్
- దేశభక్తిని పదేపదే చాటుకోవాల్సిన పనిలేదంటున్న సానియా
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్న సామెత… భారత టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జా మాలిక్ కు అతికినట్లు సరిపోతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడిన ప్రతీసారీ… రాజాసింగ్ లాంటి బీజెపీ నాయకులు… సానియాను పరోక్షంగా దెప్పి పొడవటం, తమ వ్యాఖ్యలతో సానియా సహనానికి పరీక్ష పెట్టడం ఓ అలవాటుగా మారింది.
విమర్శలకు కేంద్రబిందువుగా….
భారత టెన్నిస్ క్వీన్, పాకిస్థాన్ కోడలు సానియామీర్జా మాలిక్ …మరోసారి బీజెపీ నాయకుల విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తన ప్రమేయం లేకుండానే సానియా మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది.
ముంబై లో పుట్టి… హైదరాబాద్ లో పెరిగి భారత టెన్నిస్ కే గర్వకారణంగా నిలిచిన సానియా మీర్జా…పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లాడటమే ఓ వివాదంగా మారింది.
సానియా…పాకిస్థాన్ కోడలిగా మారటంతోనే విమర్శలు, కష్టాలు ప్రారంభమయ్యాయి.
వివాదాలకు నెలవు….
సానియా ప్రపంచ మేటి టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ మాత్రమే కాదు…ఆత్మాభిమానం ఉన్న నేటితరం యువతి కావడం….. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ…కోరి కష్టాలు తెచ్చుకొన్న సంఘటనలు సానియా కెరియర్ లో ఎన్నో ఉన్నాయి.
అయితే… పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు… పుల్వామాలో జరిపిన హింసతో …సానియాకు ఏవిధమైన సంబంధం లేకపోయినా… హైదరాబాద్ నగర బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం మండిపడుతున్నారు.
పాకిస్థాన్ కోడలిగా ఉన్న సానియా మీర్జాను…తెలంగాణా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించి…హైదరాబాద్ బిడ్డలు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
సానియా అసహనం….
మరోవైపు…సానియా మాత్రం…దేశభక్తిని పదేపదే చాటుకోవాల్సిన అవసరం తనకు లేదని…వేరేవారిని కించపరచడానికి ఇళ్ళెక్కి అరవాల్సిన అవసరమేలేదంటూ తేల్చి చెప్పింది.
సానియాను తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ గతంలోనే ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి…కోటి రూపాయల చెక్ ఇచ్చిన సమయంలో బీజెపీ అప్పటి ఎమ్మెల్యే లక్ష్మణ్ సైతం… పాకిస్థాన్ కోడలికి ఈ గౌరవం ఏంటంటూ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఏదిఏమైనా… సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలు కొనసాగినంతకాలం… పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాకు…తన ప్రమేయం లేకుండానే ఇబ్బందికర పరిస్థితి తప్పేలా ఏమాత్రం కనిపించడం లేదు.