వలసలు ఆపేందుకు చంద్రబాబు కొత్త వ్యూహం ఇదే!

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు ఇప్పటికే బయటకు వెళ్లారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తెలుగుదేశం పార్టీని వీడారు. వీరే గాక మరి కొందరు కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడబోయే నేతల సంఖ్య భారీగానే ఉండబోతోందని.. కనీసం పాతిక మంది ఎమ్మెల్యే స్థాయి నేతలు తెలుగుదేశం పార్టీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం లేచినట్టే! […]

Advertisement
Update:2019-02-17 06:26 IST

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు ఇప్పటికే బయటకు వెళ్లారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తెలుగుదేశం పార్టీని వీడారు. వీరే గాక మరి కొందరు కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడబోయే నేతల సంఖ్య భారీగానే ఉండబోతోందని.. కనీసం పాతిక మంది ఎమ్మెల్యే స్థాయి నేతలు తెలుగుదేశం పార్టీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం లేచినట్టే!

ఇలాంటి నేపథ్యంలో పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడాన్ని ఆపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. ఈ మేరకు బాబు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. వలసలను ఆపాలని పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

ఒకవైపు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లినా నష్టం లేదని.. తెలుగుదేశం అధినేత అన్నట్టుగా మీడియాకు లీకులు ఇస్తున్నారు. అదే సమయంలో..పొలిట్ బ్యూరో మీటింగులో మాత్రం వలసలను ఆపాలని గట్టిగా తీర్మానించుకున్నారట. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను గుర్తించి.. వారు బయటకు వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. అందులో భాగంగా.. అసంతృప్త నేతల్లో కొందరికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడానికి బాబు రెడీ అవుతున్నారట.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా పలువురు నేతలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖాయం అయ్యాయి. అలాంటి వారి చేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయిస్తున్నారు. వీటిని అసంతృప్తనేతలకు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ విధంగా పార్టీ నుంచి నేతల వలసలను ఆపాలని బాబు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.

Tags:    
Advertisement

Similar News