చర్మంపై ముడతలు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి!
వయస్సు మీద పడుతున్నా కొద్దీ…. చర్మంపై ముడతలు వస్తుంటాయి. ఇది సహజంగా అందరిలోనూ జరిగే ప్రక్రియనే. కానీ కొందరికి మాత్రం చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడుతుంది. అలా జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ కొన్ని సూచనలు పాటిస్తే… చర్మంపై ముడతలు తగ్గించుకోవచ్చు. ఆ సూచనలేంటో ఓ లుక్కేయండి. 1. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసాన్ని తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని […]
వయస్సు మీద పడుతున్నా కొద్దీ…. చర్మంపై ముడతలు వస్తుంటాయి. ఇది సహజంగా అందరిలోనూ జరిగే ప్రక్రియనే. కానీ కొందరికి మాత్రం చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడుతుంది. అలా జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ కొన్ని సూచనలు పాటిస్తే… చర్మంపై ముడతలు తగ్గించుకోవచ్చు. ఆ సూచనలేంటో ఓ లుక్కేయండి.
1. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసాన్ని తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా నెలపాటు చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
2. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేస్తుండాలి. దీని వల్ల చర్మం పై ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడుతుంటాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
3. ముఖాన్ని చల్లని నీళ్లతో కడుక్కన్న వెంటనే టవల్ తో తుడుచుకోకుండా….అలాగే ఆరనివ్వాలి. ఇలా చేస్తే చర్మం కొంత తేమను పీల్చుకుని….చర్మానికి తాజాదనం తెచ్చేలా చేస్తుంది.
4.క్యారెట్ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. క్యారెట్ జూస్ ను నిత్యం తీసుకున్నట్లయితే…ముఖం మీదున్న ముడతలు తగ్గుతాయి.
5. బొప్పాయిలో చాలా సహజగుణాలు ఉన్నాయి. బొప్పాయి గుజ్జును ముఖం, మెడ మీద బాగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మానికి మంచి రంగు రావడంతోపాటు ముడతలు తగ్గుతాయి.