తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత సుధాకర్

మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధాకర్, అతని సహచరి నీలిమ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గత ఏడాది కాలంగా సుధాకర్ లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సారంగపూర్‌కు చెందిన సుధాకర్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో పీపుల్స్‌వార్ కార్యకలాపాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని… ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా మార్పు చెందిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీలో తొలుత బెంగళూరు […]

Advertisement
Update:2019-02-13 10:35 IST

మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధాకర్, అతని సహచరి నీలిమ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గత ఏడాది కాలంగా సుధాకర్ లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సారంగపూర్‌కు చెందిన సుధాకర్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో పీపుల్స్‌వార్ కార్యకలాపాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని… ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా మార్పు చెందిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీలో తొలుత బెంగళూరు కేంద్రంగా ఆయుధాల టెక్నికల్ టీంలో పని చేసిన సుధాకర్.. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఎదిగారు.

గతంలో ఒక సారి పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేశారు. 1986లో ఆయనను అరెస్టు చేసినప్పుడు 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల తర్వాత విడులైన సుధాకర్ రైతు కూలీ సంఘంలో పని చేసి 1990లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించని సుధాకర్ చివరిగా బీహార్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కోసం చురుకుగా పని చేశారు.

మూడు రోజుల క్రితమే ఆయన బీహార్‌లో లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కాని ఇవాళ ఆయన తెలంగాణలో లొంగిపోయినట్లు డీజీపీ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News