నకిలీ ఓట్లపై ర్యాండమ్ సర్వే చేస్తాం : సీఈసీ సునీల్ అరోరా
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఇవాళ అమరావతిలో ఏపీ అధికారులతో సమావేశమయ్యారు. పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం పంచుతున్న పసుపు-కుంకుమ పోస్ట్ డేటెడ్ చెక్కులపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం సునీల్ అరోరా మీడియాతో మాట్లాడారు. సర్వేలు చేస్తూ ఓట్లు తొలగిస్తున్నారని.. ఏపీ, తెలంగాణలో ఓట్లు కలిగి ఉన్నారనే పిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. నకిలీ ఓట్లు కూడా భారీగా నమోదైన విషయం తమ దృష్టికి […]
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఇవాళ అమరావతిలో ఏపీ అధికారులతో సమావేశమయ్యారు. పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం పంచుతున్న పసుపు-కుంకుమ పోస్ట్ డేటెడ్ చెక్కులపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం సునీల్ అరోరా మీడియాతో మాట్లాడారు.
సర్వేలు చేస్తూ ఓట్లు తొలగిస్తున్నారని.. ఏపీ, తెలంగాణలో ఓట్లు కలిగి ఉన్నారనే పిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. నకిలీ ఓట్లు కూడా భారీగా నమోదైన విషయం తమ దృష్టికి వచ్చిందని సీఈసీ చెప్పారు. ఈ విషయంపై స్పష్టత కోసం ర్యాండమ్ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు అరోరా తెలిపారు.
ఇక మహిళలకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇంతకు ముందే ఉన్న పథకంలో భాగమని తెలిసిందని.. కాబట్టి ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్దం కాదని ఆయన చెప్పారు. ఇక ఏపీ డీజీపీపై ఎవరూ లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయలేదని…. ఒక వేళ అలాంటి లిఖిత పూర్వక పిర్యాదు వస్తే తప్పక పరిశీలించి విచారణ జరుపుతామన్నారు.
ఆర్టీజీఎస్ ద్వారా జరిగిన సర్వే అంశంపై ఏపీ సీఈవో పరిశీలించి విచారిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇక కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.