ఇక్రిశాట్‌లో చిరుత సంచారం.... వారం రోజులుగా ఉద్యోగుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఉన్న ఇక్రిశాట్‌లో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం నుంచి చిరుత సంచరిస్తున్నా ఆ విషయం మాత్రం బుధవారం నాడు సీసీ టీవీ కెమేరాల్లో గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోనికి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుత తిరిగిన ప్రదేశాలను పరిశీలించి దాని ఉనికిని నిర్థారించారు. చిరుత వయసు 6 ఏళ్లు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాన్ని పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు […]
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఉన్న ఇక్రిశాట్‌లో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం నుంచి చిరుత సంచరిస్తున్నా ఆ విషయం మాత్రం బుధవారం నాడు సీసీ టీవీ కెమేరాల్లో గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
ఇక్రిశాట్ ఉద్యోగులు, కార్మికులను యాజమాన్యం అప్రమత్తం చేసింది. చిరుతను పట్టుకోవడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. దాదాపు 20 మంది అధికారులు రంగంలోనికి దిగారు.
చిరుత వికారాబాద్ అడవుల్లోంచి వచ్చినట్లు వారు చెబుతున్నారు. 2016లో కూడా ఇక్రిశాట్‌లో చిరుత ప్రవేశించింది. అప్పుడు అటవీ శాఖ అధికారులు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.