ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో కుల్దీప్ కు రెండోస్థానం

బౌలర్ ర్యాంకింగ్స్ మొదటి రెండుస్థానాల్లో రషీద్,కుల్దీప్ బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ 7వ స్థానంలో రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో టీమిండియా 1-2తో ఓడినా….చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్…తన కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు టీ-20 మ్యాచ్ లకు దూరంగా ఉన్న కుల్దీప్…హామిల్టన్ వేదికగా ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా 2 వికెట్లు పడగొట్టడంతో పాటు…తన ర్యాంక్ ను […]

Advertisement
Update:2019-02-11 11:20 IST
  • బౌలర్ ర్యాంకింగ్స్ మొదటి రెండుస్థానాల్లో రషీద్,కుల్దీప్
  • బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ 7వ స్థానంలో రోహిత్ శర్మ

న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో టీమిండియా 1-2తో ఓడినా….చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్…తన కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు.

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు టీ-20 మ్యాచ్ లకు దూరంగా ఉన్న కుల్దీప్…హామిల్టన్ వేదికగా ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా 2 వికెట్లు పడగొట్టడంతో పాటు…తన ర్యాంక్ ను ప్రస్తుత 3వ స్థానం నుంచి రెండో స్థానానికి మెరుగుపరచుకోగలిగాడు.

ఐసీసీ టీ-20 బౌలర్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం… అప్ఘాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంకర్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 24 ఏళ్ల కుల్దీప్ యాదవ్ నిలిచాడు.

ఇక…బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు, ఓపెనర్ శిఖర్ ధావన్ 11 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

టీ-20 టీమ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, టీమిండియా మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ నాలుగు, ఇంగ్లండ్ ఐదు ర్యాంకులు సాధించాయి.

Tags:    
Advertisement

Similar News