భార్య‌ను చంపేందుకు యూఎస్ పోలీసుల‌కు సుపారీ

భార్య‌తో వేగ‌లేక ఆమెను హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించాడో భార‌తీయుడు. చివ‌ర‌కు అమెరికా పోలీసుల అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌తో దొరికిపోయాడు. అమెరికాలోని ఇండియానాలో ఉంటున్న 55 ఏళ్ల‌ న‌ర్స‌న్ లింగాల కొద్దికాలంగా భార్య‌కు దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మ‌ధ్య విడాకుల వ్య‌వ‌హారం నడుస్తోంది. ప్ర‌స్తుతం లింగాల 52 ఏళ్ల సంధ్యా అనే మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో భార్య‌తో విడాకుల వ్య‌వ‌హారంలో వ‌స్తున్న ఇబ్బందుల‌ను భ‌రించ‌లేక ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. ఒక కేసు విచార‌ణ సంద‌ర్భంగా కొన్ని నెల‌ల క్రితం మిడిల్ నెక్స్ కౌంటీ కోర్టుకు హాజ‌రైన […]

Advertisement
Update:2019-02-08 02:30 IST

భార్య‌తో వేగ‌లేక ఆమెను హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించాడో భార‌తీయుడు. చివ‌ర‌కు అమెరికా పోలీసుల అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌తో దొరికిపోయాడు. అమెరికాలోని ఇండియానాలో ఉంటున్న 55 ఏళ్ల‌ న‌ర్స‌న్ లింగాల కొద్దికాలంగా భార్య‌కు దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మ‌ధ్య విడాకుల వ్య‌వ‌హారం నడుస్తోంది. ప్ర‌స్తుతం లింగాల 52 ఏళ్ల సంధ్యా అనే మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో భార్య‌తో విడాకుల వ్య‌వ‌హారంలో వ‌స్తున్న ఇబ్బందుల‌ను భ‌రించ‌లేక ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. ఒక కేసు విచార‌ణ సంద‌ర్భంగా కొన్ని నెల‌ల క్రితం మిడిల్ నెక్స్ కౌంటీ కోర్టుకు హాజ‌రైన సంద‌ర్భంగా ఒక నేర‌స్తుడితో లింగాల‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. భార్య‌ను హ‌త్య చేసేందుకు అత‌డి సాయం కోరాడు. భార్య‌ను చంపేందుకు ఎవ‌రినైనా చూడాల‌ని కోరారు. అయితే
స‌ద‌రు ఖైదీ ఆ విష‌యాన్ని తానుంటున్న జైలు ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేశాడు. జైలు అధికారులు ఇచ్చిన స‌మాచారంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.

న‌ర్స‌న్ లింగాల, సంధ్యా

ఒక పోలీసును హ‌త్య చేసే వ్య‌క్తిగా లింగాల వ‌ద్ద‌కు పంపించారు. 10వేల డాల‌ర్లు ఇస్తే హ‌త్య చేసి పెడుతాన‌ని మ‌ప్టీలోని పోలీసు చెప్పాడు. అది న‌మ్మిన లింగాల అడ్వాన్స్‌గా వెయ్యి డాల‌ర్ల‌ను ఇచ్చాడు. త‌న భార్య‌కు సంబంధించిన అన్ని వివ‌రాలు అందించాడు. ఈ ఆప‌రేష‌న్‌ను ర‌హ‌స్య కెమెరాల్లో రికార్డు చేసిన పోలీస్… అనంత‌రం లింగాల‌ను అరెస్ట్ చేశారు. అత‌డి
ప్రియురాలు సంధ్యాను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప‌క్కా ఆధారాలు ఉండ‌డంతో లింగాల‌, సంధ్యాపై నేరం రుజువు కావ‌డం ఖాయంగా చెబుతున్నారు. అదే జ‌రిగితే ప‌దేళ్ల జైలుతో పాటు, 2.5ల‌క్ష‌ల డాల‌ర్ల జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News