చెవిరెడ్డి హత్యకు రూ. 30లక్షలు.... అంగీకరించిన నిందితులు

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హత్యకు ప్రత్యర్థులు రెక్కీ నిర్వహించిన అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిందితులు మీడియా ముఖంగానే ఈ విషయాన్ని అంగీకరించారు. చెవిరెడ్డిని హత్య చేసే ప్రణాళికలో భాగంగా ఆయన వద్దకు ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు డ్రైవర్ల రూపంలో పంపారు. అయితే ఈ విషయాన్ని చెవిరెడ్డి పసిగట్టి వారిని గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. అనంతరం నిందితులు చెవిరెడ్డి సమక్షంలో మీడియా ముందు అసలు విషయాలు చెప్పారు. చెవిరెడ్డిని హత్య చేసేందుకు […]

Advertisement
Update:2019-02-06 02:01 IST

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హత్యకు ప్రత్యర్థులు రెక్కీ నిర్వహించిన అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిందితులు మీడియా ముఖంగానే ఈ విషయాన్ని అంగీకరించారు. చెవిరెడ్డిని హత్య చేసే ప్రణాళికలో భాగంగా ఆయన వద్దకు ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు డ్రైవర్ల రూపంలో పంపారు. అయితే ఈ విషయాన్ని చెవిరెడ్డి పసిగట్టి వారిని గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. అనంతరం నిందితులు చెవిరెడ్డి సమక్షంలో మీడియా ముందు అసలు విషయాలు చెప్పారు.

చెవిరెడ్డిని హత్య చేసేందుకు చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని 30 లక్షలు సుపారీ ఇచ్చారని నిందితులు వివరించారు. నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులకు రూ. 30లక్షలు ఇచ్చి… నెల రోజుల క్రితం చెవిరెడ్డి వద్దకు పంపించారు. వారు నెల రోజులుగా చెవిరెడ్డి కదలికలను గమనిస్తూ ఎప్పటికప్పుడు పులివర్తి నానికి సమాచారం అందిస్తున్నారు.

డ్రైవర్ల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో చెవిరెడ్డి అనుచరులు వారిని పట్టుకుని విచారించారు. వాట్సాప్‌లో జరిగిన చాటింగ్‌ను గుర్తించారు. తొలి దశలో చెవిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల కదలికలు, చెవిరెడ్డి ఎక్కడికి ఎక్కువగా వెళ్తున్నారు?.. ఏ దారిలో వెళ్తుంటాడు? వంటి వివరాలు సేకరించాలని… ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చెబుతామని పులివర్తి నాని అనుచరులు తమకు చెప్పారని ఇద్దరు నిందితులు మీడియాతో చెప్పారు.

Tags:    
Advertisement

Similar News