భారీగా బకాయిలు.... ఏపీ, తెలంగాణకు కరెంట్ కట్
మన ఇంట్లో విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన బిల్లు కట్టకపోతే వెంటనే కరెంట్ కట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కరెంటు సరఫరా నిలిపి వేయాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ నెల 9వ తేదీ నుంచి విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా నియంత్రణ నోటీసులను ఎన్టీపీసీ పంపింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 7,859 కోట్ల రూపాయల బకాయిలు రావల్సి ఉంది. దానిలో […]
మన ఇంట్లో విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన బిల్లు కట్టకపోతే వెంటనే కరెంట్ కట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కరెంటు సరఫరా నిలిపి వేయాలని ఎన్టీపీసీ నిర్ణయించింది.
తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ నెల 9వ తేదీ నుంచి విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా నియంత్రణ నోటీసులను ఎన్టీపీసీ పంపింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 7,859 కోట్ల రూపాయల బకాయిలు రావల్సి ఉంది. దానిలో ఈ మూడు రాష్ట్రాల బకాయిలే 4,890 కోట్ల రూపాయలని ఎన్టీపీసీ చెబుతోంది.
గత రెండు నెలలుగా బకాయిలు చెల్లించడంలో విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీపీసీ వివరించింది. ఈ మూడు రాష్ట్రాలే కాక ఉత్తరప్రదేశ్ పలు విద్యుత్ సరఫరా సంస్థలకు భారీ బకాయిలు చెల్లించాలి. దాదాపు 6,127 కోట్లు ఈ రాష్ట్రం బకాయి ఉంది. ఇక రాజస్థాన్ 2,404 కోట్లు, పంజాబ్ 1,041 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.