దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడు- ఏపీ స్పీకర్ సవాల్
స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో గెలిచేందుకు 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పడంతో పాటు, ”ఆడది వంటింట్లో ఉండాలి… కారు షెడ్లో ఉండాలి” వంటి వ్యాఖ్యలు చేయడం, స్పీకర్ అయి ఉండి కూడా నేరుగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇతర పార్టీల నేతలకు టీడీపీ కండువా కప్పడం వంటి చర్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాదరావు తాజాగా ప్రతిపక్ష నేత జగన్ పట్ల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో […]
స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో గెలిచేందుకు 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పడంతో పాటు, ”ఆడది వంటింట్లో ఉండాలి… కారు షెడ్లో ఉండాలి” వంటి వ్యాఖ్యలు చేయడం, స్పీకర్ అయి ఉండి కూడా నేరుగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇతర పార్టీల నేతలకు టీడీపీ కండువా కప్పడం వంటి చర్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాదరావు తాజాగా ప్రతిపక్ష నేత జగన్ పట్ల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన కోడెల శివప్రసాదరావు… 40 ఏళ్లుగా రాజకీయాల్లో నిప్పులా బతికానని చెప్పుకున్నారు. ఒక్క అవినీతి పని కూడా చేయలేదన్నారు. అలాంటి తనపై ఒక దుర్మార్గుడు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి ప్రతి చిన్న పనికి కోడెల లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నాడని మండిపడ్డారు.
16 నెలలు జైల్లో ఉన్న జగన్‌కు చంద్రబాబులాంటి వ్యక్తిని విమర్శించే ధైర్యం ఎలా వచ్చిందని బెదిరింపు ధోరణిలో స్పీకర్ మాట్లాడారు. వైసీపీ వాళ్లకు దమ్ముంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలని స్పీకర్ సవాల్ చేశారు. లేదంటే తానే జగన్ రమ్మన్న చోటికి వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు.
చంద్రబాబుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చంద్రబాబు లేకుంటే అమరావతితో పాటు రాష్ట్రంలో మరుగుదొడ్లు కూడా వచ్చేవి కావన్నారు. స్పీకర్ అయి ఉండి ఇలా ప్రతిపక్షంపై సవాళ్లు విసరడం చర్చనీయాంశమైంది.