భారీ బడ్జెట్‌... ఏ శాఖకు ఎంత? ఏ పథకానికి ఎంత?

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రూ. 2లక్షల 26వేల 177 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పలు కొత్త పథకాలను ప్రకటించారు. పాత పథకాలకు నిధులను పెంచారు. రైతుల కోసం కొత్తగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి రూ. 5వేల కోట్లు కేటాయించారు. వివిధ పథకాలకు కేటాయించిన నిధులను పరిశీలిస్తే… రెవెన్యూ వ్యయం అంచనా- లక్షా 80 వేల కోట్లు ఆర్థిక లోటు అంచనా రూ. 32, 390 […]

Advertisement
Update:2019-02-05 07:57 IST

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రూ. 2లక్షల 26వేల 177 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పలు కొత్త పథకాలను ప్రకటించారు. పాత పథకాలకు నిధులను పెంచారు. రైతుల కోసం కొత్తగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి రూ. 5వేల కోట్లు కేటాయించారు. వివిధ పథకాలకు కేటాయించిన నిధులను పరిశీలిస్తే…

రెవెన్యూ వ్యయం అంచనా- లక్షా 80 వేల కోట్లు
ఆర్థిక లోటు అంచనా రూ. 32, 390 కోట్లు,
వ్యవసాయ రంగానికి రూ. 12, 732 కోట్లు
పంచాయతీరాజ్,రూరల్ డెవలప్‌మెంట్‌కు రూ. 35వేల 182 కోట్లు,
సాంఘిక సంక్షేమానికి రూ. 6, 861 కోట్లు,
ఉన్నత విద్యకు రూ. 3, 171 కోట్లు,
పౌర సరఫరాలు రూ. 3,763 కోట్లు,
ధరల స్థిరీకరణ నిధి రూ. 1000 కోట్లు
ఆహార శుద్ధి పరిశ్రమకు రూ. 300 కోట్లు
పశువుల బీమాకు రూ. 200 కోట్లు
పశుగ్రాసం కోసం రూ. 200 కోట్లు
చేనేతకు రూ. 225 కోట్లు
ఇరిగేషన్‌కు రూ. 16,852 కోట్లు
ఐటీ శాఖకు రూ. వెయ్యి ఆరు కోట్లు
మున్సిపల్ శాఖకు రూ. 7,979 కోట్లు
న్యాయ శాఖకు రూ. 911 కోట్లు,
గృహనిర్మాణానికి రూ. 4, 079 కోట్లు
ప్రాథమిక విద్యకు రూ. 22, 783 కోట్లు,
క్రీడా శాఖకు రూ. 1982 కోట్లు,
కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు,
బీసీ కార్పొరేషన్‌కు రూ. 3వేల కోట్లు,
బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు,
క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు,
ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు,
మైనార్టీ సంక్షేమానికి రూ. 1304 కోట్లు,
డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు,
ఇళ్ల స్థలాల సేకరణకు రూ. 200 కోట్లు,
విత్తనాభివృద్ధి సంస్థకు రూ. 200 కోట్లు,
ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ. 14వేల 367 కోట్లు,
ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ. 5, 385 కోట్లు,
పసుపు- కుంకుమకు రూ. 4వేల కోట్లు,
డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాల కోసం 1100 కోట్లు,
ముఖ్యమంత్రి యువనేస్తంకు రూ. 1200 కోట్లు,
అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు,
చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు,
ఎన్టీఆర్ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు,
రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు రూ. 226 కోట్లు,
ఏపీలో రైల్వే లైన్లకు రూ. 180 కోట్లు,
రోడ్లు భవనాల శాఖకు రూ. 5, 382 కోట్లు

Advertisement

Similar News