వివేక హత్య కేసులో కీలక పరిణామం
మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఎ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు.
మాజీ మంత్రి వివేకనంద హత్యకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా పీఎ కృష్ణారెడ్డి ఇంటికి ఈ ఉదయం పోలీసులు వెళ్లారు. కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ సమక్షంలో కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, గతంలో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ లపై పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై కేసు నమోదయింది.
ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. న్యాయవాదుల సమక్షంలో ఆయనను విచారించారు. కృష్ణారెడ్డి తరఫున లాయర్ల సమక్షంలో విచారణ చేస్తున్నారు. కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్న పోలీసుల.. ఈ విషయాన్ని రహస్యంగా చేస్తున్నట్లు సమాచారం. కడప జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది