ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డబుల్ సెంచరీల అరుదైన డబుల్
200 సంవత్సరాల ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అసాధారణ రికార్డు 1938 తర్వాత శ్రీలంక క్రికెటర్ ఏంజెలో పెరెరా రికార్డు ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ డబుల్ సెంచరీలు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ సాధించడం అంటేనే అదో గొప్ప ఘనత. అలాంటిది డబుల్ సెంచరీ సాధిస్తే …వావ్ అనుకోవాల్సిందే. అదే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ ఒకే ఆటగాడు డబుల్ సెంచరీలు సాధించడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. 200 సంవత్సరాల ఫస్ట్ క్లాస్ క్రికెట్ […]
- 200 సంవత్సరాల ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అసాధారణ రికార్డు
- 1938 తర్వాత శ్రీలంక క్రికెటర్ ఏంజెలో పెరెరా రికార్డు
- ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ డబుల్ సెంచరీలు
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ సాధించడం అంటేనే అదో గొప్ప ఘనత. అలాంటిది డబుల్ సెంచరీ సాధిస్తే …వావ్ అనుకోవాల్సిందే. అదే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ ఒకే ఆటగాడు డబుల్ సెంచరీలు సాధించడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది.
200 సంవత్సరాల ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో……ఇప్పటి వరకూ రెండంటే రెండుసార్లు మాత్రమే …ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ.. ఒకే ఆటగాడు డబుల్ సెంచరీలు సాధించిన అరుదైన రికార్డు నమోదయ్యింది.
1938 ఆర్థర్ ఫాగ్….
1938 సీజన్లో…ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ పోటీలలో భాగంగా ఎసెక్స్ జట్టుతో జరిగిన పోటీలో కెంట్ ఆటగాడు ఆర్థర్ ఫాగ్ మొదటి ఇన్నింగ్స్ లో 244, రెండో ఇన్నింగ్స్ లో 202 నాటౌట్ స్కోర్లు సాధించాడు. ఈ ఘనత సాధించిన సమయంలో ఆర్ధర్ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే.
2019లో ఏంజెలో పెరెరా….
ఆ తర్వాత 81 సంవత్సరాల విరామం తర్వాత…అలాంటి రికార్డునే శ్రీలంక ఆటగాడు ఏంజెలో పెరెరా సాధించి సంచలనం సృష్టించాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో… నాన్ డిస్క్రిప్ట్స్ క్లబ్ కెప్టెన్ గా బ్యాటింగ్ కు దిగిన 23 ఏళ్ల ఏంజెలో పెరెరా తొలిఇన్నింగ్స్ లో…. కేవలం 203 బాల్స్ లోనే 201 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 268 బాల్స్ ఎదుర్కొని 231 పరుగులు సాధించాడు. మొత్తం 40 బౌండ్రీలు, ఆరు సిక్సర్లతో ఏంజెలో పెరెరా పరుగుల మోత మోగించాడు.
తొలిఇన్నింగ్స్ లో 99.01, రెండో ఇన్నింగ్స్ లో 86.19 సగటు నమోదు చేయటం విశేషం. 2013లో శ్రీలంక తరపున టీ-20 క్యాప్ అందుకొన్న పెరెరా 2016 సీజన్ నుంచి శ్రీలంకజట్టులో చోటు కోల్పోయాడు.
టీ-20 క్రికెట్లో రెండు శతకాలు బాదిన ఏకైక శ్రీలంక క్రికెటర్ గా రికార్డు సాధించిన ఏంజెలో పెరెరా…ప్రస్తుత డబుల్ సెంచరీల రికార్డుతో తిరిగి శ్రీలంక జట్టులో చేరే అవకాశం మెరుగయ్యింది.