నిబంధనలు అతిక్రమించిన తారకరత్న రెస్టారెంట్‌ కూల్చివేతకు యత్నం

నందమూరి నటుడికి జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో తారకరత్న నిర్వహిస్తున్న ‘కబరా డ్రైవ్ ఇన్‌ రెస్టారెంట్‌’ ను కూల్చేందుకు అధికారులు వచ్చారు. దాంతో రెస్టారెంట్‌ నిర్వాహకులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన అక్కడికి వచ్చారు. నిబంధనలకు విరుద్దంగా ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. రాత్రి పూట మద్యం అమ్ముతూ, సౌండ్ సిస్టమ్స్ పెడుతూ న్యూసెన్స్‌ […]

Advertisement
Update:2019-02-04 10:17 IST
నిబంధనలు అతిక్రమించిన తారకరత్న రెస్టారెంట్‌ కూల్చివేతకు యత్నం
  • whatsapp icon

నందమూరి నటుడికి జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో తారకరత్న నిర్వహిస్తున్న ‘కబరా డ్రైవ్ ఇన్‌ రెస్టారెంట్‌’ ను కూల్చేందుకు అధికారులు వచ్చారు. దాంతో రెస్టారెంట్‌ నిర్వాహకులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.

విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన అక్కడికి వచ్చారు. నిబంధనలకు విరుద్దంగా ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. రాత్రి పూట మద్యం అమ్ముతూ, సౌండ్ సిస్టమ్స్ పెడుతూ న్యూసెన్స్‌ క్రియేట్ చేస్తున్నారని స్థానిక సొసైటీ సభ్యులు కూడా జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు.

దీంతో తాము కూల్చివేసేందుకు వచ్చామని అధికారులు వివరించారు. అయితే ఈ విషయంలో తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని తారకరత్న కోరారు.

Tags:    
Advertisement

Similar News