నలుగురి ప్రాణాలు తీసిన అరటి గెలలు...

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పనులు ప్రారంభించిన రోజే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. త్వరలో పెళ్లి ఉండడంతో అరటి గెలలు కోసేందుకు వెళ్లి తోటలోనే ప్రాణాలు కోల్పోయారు. లావేరు మండలం తామాడలో ఈ ఘటన జరిగింది. కొమ్ము వెంకన్న కుమారుడు శీను వివాహానికి సంబంధించి ఈనెల 6న పసుపు దంచే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం అరటి గెలలు కోసేందుకు పొలం వద్దకు వెంకన్న, మరో వ్యక్తి రాముడు కలిసి వెళ్లారు. అరటి చెట్టును […]

Advertisement
Update:2019-02-04 02:11 IST

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పనులు ప్రారంభించిన రోజే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. త్వరలో పెళ్లి ఉండడంతో అరటి గెలలు కోసేందుకు వెళ్లి తోటలోనే ప్రాణాలు కోల్పోయారు. లావేరు మండలం తామాడలో ఈ ఘటన జరిగింది. కొమ్ము వెంకన్న కుమారుడు శీను వివాహానికి సంబంధించి ఈనెల 6న పసుపు దంచే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం అరటి గెలలు కోసేందుకు పొలం వద్దకు వెంకన్న, మరో వ్యక్తి రాముడు కలిసి వెళ్లారు.

అరటి చెట్టును నరకగానే అది పక్కనే కిందకు వేలాడుతూ ఉన్న విద్యుత్‌ తీగలపై పడింది. దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పొలానికి వెళ్లిన వారు ఎంతకూ రాకపోవడంతో పక్క పొలంలోనే పనిచేస్తున్న రాముడు భార్య పుణ్యవతి, ఆమె సోదరి బంగారమ్మలు అరటి తోటలోకి వెళ్లారు.

నేలపై పడి ఉన్న రాముడు, వెంకన్నలను చూసి పరుగుపరుగున వెళ్లి వారిని తట్టారు. అంతే అప్పటికీ కరెంట్‌ ఉండడంతో వారిద్దరు కూడా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పొలం నుంచి కుటుంబసభ్యులు ఎంతకూ రాకపోవడంతో వెంకన్న కుమారుడు శీను వెళ్లి చూడగా నలుగురూ ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.

Tags:    
Advertisement

Similar News