షర్మిలపై అసభ్యకర పోస్టులు పెట్టింది ఇతడే... 2 ఎకరాల భూమి ఇచ్చిన ఏపీ సర్కార్
గత ఆరేళ్లుగా వైఎస్ షర్మిలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిని ఆట కట్టించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గలీజు నెటిజన్లను గుర్తించారు. ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇతడు గుంటూరులోని ఆర్‌వీఆర్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురాగా అక్కడ మీడియాను […]
గత ఆరేళ్లుగా వైఎస్ షర్మిలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిని ఆట కట్టించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గలీజు నెటిజన్లను గుర్తించారు. ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇతడు గుంటూరులోని ఆర్‌వీఆర్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురాగా అక్కడ మీడియాను చూడగానే వెంకటేశ్వరరావు సిగ్గుపడిపోయాడు. ముఖం దాచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు.
పోలీసుల విచారణలో తానే షర్మిలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టు అంగీకరించాడు. కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేసినట్టు వెల్లడించారు. షర్మిలకు సంబంధించిన వార్తల కింద పనిగట్టుకుని తీవ్రస్థాయిలో అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నట్టు ఒప్పుకున్నాడు. ఇతడికి ఏపీలో అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలున్నట్టు తేలింది. తమ కుటుంబానికి సొంతూరు వేముల గ్రామంలో ఏపీ ప్రభుత్వం రెండెకరాల భూమిని కూడా ఇచ్చినట్టు వివరించాడు వెంకటేశ్వరరావు.
షర్మిలపై తప్పుడు పోస్టులు పెట్టిన మరికొందరిని కూడా గూగుల్ సంస్థ సాయంతో గుర్తించారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీసీఎస్ పోలీసులు ప్రకటించారు.