అన్నం బ్లాక్‌లో అమ్ముకుంటున్న నరసరావుపేట ముఖ్యనేత కుమార్తె?
గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పరిస్థితులు చాలా భిన్నంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కుమార్తె, కుమారుడు కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు నియోజక వర్గాల్లో వీరు ప్రత్యేకంగా పన్ను వసూలు చేస్తున్నట్టు అందరూ చెబుతుంటారు. తాజాగా అన్న క్యాంటీన్ ల పైనా ముఖ్యనేత కుమార్తె కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై పెద్దెత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేత కుమార్తెకు చెందిన కంపెనీలోని కార్మికులకు అన్న […]
గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పరిస్థితులు చాలా భిన్నంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కుమార్తె, కుమారుడు కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
రెండు నియోజక వర్గాల్లో వీరు ప్రత్యేకంగా పన్ను వసూలు చేస్తున్నట్టు అందరూ చెబుతుంటారు. తాజాగా అన్న క్యాంటీన్ ల పైనా ముఖ్యనేత కుమార్తె కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై పెద్దెత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యనేత కుమార్తెకు చెందిన కంపెనీలోని కార్మికులకు అన్న క్యాంటీన్ల నుంచి భోజనాన్ని తరలిస్తున్నారు. మధ్యాహ్నం 150 భోజనాలు, సాయంత్రం మరో 150 భోజనాలను అన్న క్యాంటీన్ల నుంచి తీసుకెళ్తున్నారట.
ఇలా తీసుకెళ్లిన భోజనాలను తమ కంపెనీలోని కార్మికులకు ఉచితంగా ఏమీ పెట్టడం లేదని… వారి నుంచి ఒక్కో భోజనానికి 25 రూపాయలు వసూలు చేస్తున్నారని… అన్న క్యాంటీన్ల నుంచి ఉచితంగా భోజనాలు తీసుకెళ్లి సొంత కార్మికులకు అమ్ముకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారని ప్రముఖ పత్రిక కథనం.