రేపటి నుంచి మళ్లీ తెరుచుకోనున్న నుమాయిష్

హైదరాబాద్‌లో ప్రతీ ఏటా జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్‌లో రెండు రోజుల క్రితం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దేశంలో జరిగే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో అత్యంత ప్రముఖమైన నుమాయిష్.. అగ్నిప్రమాదం తర్వాత మూసి వేశారు. ప్రతీ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ప్రదర్శన అర్థాంతరంగా ఆగిపోవడంతో సందర్శకులు, వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం తర్వాత వెంటనే స్పందించిన ఎగ్జిబిషన్ సొసైటీ పునరుద్దర పనులు ప్రారంభించింది. అగ్గికి […]

Advertisement
Update:2019-02-01 15:25 IST

హైదరాబాద్‌లో ప్రతీ ఏటా జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్‌లో రెండు రోజుల క్రితం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దేశంలో జరిగే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో అత్యంత ప్రముఖమైన నుమాయిష్.. అగ్నిప్రమాదం తర్వాత మూసి వేశారు. ప్రతీ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ప్రదర్శన అర్థాంతరంగా ఆగిపోవడంతో సందర్శకులు, వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు.

అగ్ని ప్రమాదం తర్వాత వెంటనే స్పందించిన ఎగ్జిబిషన్ సొసైటీ పునరుద్దర పనులు ప్రారంభించింది. అగ్గికి ఆహుతైన స్టాల్స్ స్థానంలో కొత్త స్టాల్స్ ఏర్పాటు చేసింది. శిథిలాలను తొలగించి తిరిగి ప్రదర్శనకు అనుకూలంగా మలిచింది.

అంతే కాకుండా అగ్ని ప్రమాదంలో నష్టపోయిన స్టాల్స్ నిర్వాహకులకు ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సొసైటీ అందించింది. అంతే కాకుండా బాధితులకు తప్పకుండా అండగా ఉంటామనే హామీ ఇచ్చింది.

మరో వైపు ఈ ఘటన జరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఒక కమిటీని ఎగ్జిబిషన్ సొసైటీ నియమించింది. ఆ నివేదిక అనంతరం స్టాల్స్ నిర్వాహకులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించనున్నట్లు సమాచారం.

ఇక ఈ నెల 15న ముగియాల్సిన ఎగ్జిబిషన్‌ను మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News