తూ. గో. కలెక్టర్‌పై కొడాలి తనూజ ఆరోపణలు
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రాపై రాజమండ్రిలోని హోటల్ షెల్టన్ వైస్ ప్రెసిడెంట్ కొడాలి తనూజ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కలెక్టర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ తీరుపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తనూజ… ఏపీలో పలువురికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ హోటల్ స్థాపించానని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం తమకు ఏమాత్రం అనుకూలంగా లేవని వాపోయారు. గోదావరి పుష్కరాల సమయంలో తమ హోటల్ గదులను ప్రభుత్వం అద్దెకు […]
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రాపై రాజమండ్రిలోని హోటల్ షెల్టన్ వైస్ ప్రెసిడెంట్ కొడాలి తనూజ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కలెక్టర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కలెక్టర్ తీరుపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తనూజ… ఏపీలో పలువురికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ హోటల్ స్థాపించానని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం తమకు ఏమాత్రం అనుకూలంగా లేవని వాపోయారు.
గోదావరి పుష్కరాల సమయంలో తమ హోటల్ గదులను ప్రభుత్వం అద్దెకు తీసుకుందని… కానీ ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. బిల్లులు చెల్లించాల్సిందిగా కోరేందుకు కలెక్టర్‌ను కలవగా ఆయన తనను బెదిరించారని చెప్పారు. బిల్లులు అడిగితే హోటలే మూసివేయిస్తానని కలెక్టర్ కార్తీకేయ మిశ్రా హెచ్చరించారని చెప్పారామె.
2015లో పుష్కరాలు విజయవంతం కావాలన్న ఆకాంక్షతో అధికారులు చెప్పిన అన్ని ఏర్పాట్లను తాము హోటల్‌లో చేశామని ఆమె వివరించారు. ఇప్పుడు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆవేదన చెందారు.
అమెరికాలో ఉద్యోగాలు వదలుకుని వచ్చి ఇక్కడ సేవ చేసేందుకు ప్రయత్నిస్తే తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె కంటతడి పెట్టుకున్నారు. దాదాపు 20 మంది అధికారుల సమక్షంలోనే కలెక్టర్ తనను చాలా అవమానకరంగా మాట్లాడారని తనూజ ఆరోపించారు. కలెక్టర్‌పై చంద్రబాబు, నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు.