20వేల కోట్ల స్కాం.... టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం....

నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర ఏసీబీ ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు వస్తోంది. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బొల్లినేనికి చెందిన నిర్మాణ సంస్థ మహారాష్ట్రలో పలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేసింది. విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ పనులకు సంబంధించి 35 కాంట్రాక్టులను బొల్లినేని కంపెనీ సొంతం చేసుకుంది. ఈ పనుల్లోనే భారీగా అవినీతికి పాల్పడ్డారు. కొందరు అధికారులతో కుమ్మక్కు […]

Advertisement
Update:2019-01-29 02:20 IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర ఏసీబీ ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు వస్తోంది. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బొల్లినేనికి చెందిన నిర్మాణ సంస్థ మహారాష్ట్రలో పలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేసింది. విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ పనులకు సంబంధించి 35 కాంట్రాక్టులను బొల్లినేని కంపెనీ సొంతం చేసుకుంది.

ఈ పనుల్లోనే భారీగా అవినీతికి పాల్పడ్డారు. కొందరు అధికారులతో కుమ్మక్కు అయ్యి అడ్డగోలుగా అంచనా పెంచి ఏకంగా 20వేల కోట్ల రూపాయల దోపిడికి పాల్పడినట్టు మహారాష్ట్ర ఏసీబీ నిర్ధారించింది. ఇది వరకే అరెస్ట్‌కు ఏసీబీ ప్రయత్నించగా… హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు బొల్లినేని.

ఇప్పుడు హైకోర్టు ఆ స్టేను ఎత్తివేయడంతో అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని నాగపూర్ ఏసీబీ డీఎస్పీ ఎంఎస్‌ టోట్రే కూడా ధృవీకరించారు. బొల్లినేని కంపెనీ పలు పనులను సబ్‌కాంట్రాక్టులకు ఇచ్చింది. వారితో పనులు చేయించుకుని బిల్లులు పూర్తి స్థాయిలో తీసుకున్న బొల్లినేని కంపెనీ… పనులు చేసిన సబ్‌ కాంట్రాక్టర్లకు 209 కోట్లను ఎగ్గొట్టింది.

ఈ సబ్‌ కాంట్రాక్టుల్లో కొందరు టీడీపీ నేతలు కూడా ఉండడం విశేషం. వారు ఒక దశలో చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టగా ఆయన పట్టించుకోలేదు. బొల్లినేని రామారావుపై మహారాష్ట్రలో ఎనిమిది, యూపీలో ఒక కేసు నమోదు అయ్యాయి.

Tags:    
Advertisement

Similar News