జనగణన ఇంకెప్పుడు చేస్తారు?.. కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు
Advertisement
దేశంలో జనగణన ఇంకెప్పుడు చేస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని అడిగారు. ప్రగతిశీల విధానాలకు ఆ వివరాలు తప్పనిసరని అన్నారు. జనగణనను కావాలనే ఎన్డీయే సర్కార్ విస్మరిస్తోందని ఫైర్ అయ్యారు. సెన్సస్ చేయకపోతే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా,నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జనాభా లెక్కల కోసం నామమాత్రంగా రూ.574.80 కోట్లను మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే.
Advertisement