చీర చిరిగింది... ఆర్టీసీకి జరిమానా

ఆర్టీసీ బస్సులో రేకు తగిలి ఒక మహిళ చీర చిరిగిపోయిన వ్యవహారంలో ఆర్టీసీకి ఎదురుదెబ్బ తగిలింది. నష్టపరిహారం చెల్లింపుకు వినియోగదారుల ఫోరం ఆదేశించింది. నల్లగొండలోని అవివేలుమంగాపురం కాలనీకి చెందిన నరసింహారావు, వాణిశ్రీ దంపతులు హైదరాబాద్‌లో జరిగే ఒక వివాహానికి హాజరయ్యేందుకు 2018 ఆగస్ట్ 26న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు. బస్సు దిగే సమయంలో వాణిశ్రీ పట్టుచీర… డోర్‌ వద్ద ఉన్న ఇనుప రేకుకు తగిలి చిరిగిపోయింది. మరో మహిళ చీర కూడా అదే తరహాలో […]

Advertisement
Update:2019-01-28 02:40 IST

ఆర్టీసీ బస్సులో రేకు తగిలి ఒక మహిళ చీర చిరిగిపోయిన వ్యవహారంలో ఆర్టీసీకి ఎదురుదెబ్బ తగిలింది. నష్టపరిహారం చెల్లింపుకు వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

నల్లగొండలోని అవివేలుమంగాపురం కాలనీకి చెందిన నరసింహారావు, వాణిశ్రీ దంపతులు హైదరాబాద్‌లో జరిగే ఒక వివాహానికి హాజరయ్యేందుకు 2018 ఆగస్ట్ 26న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు.

బస్సు దిగే సమయంలో వాణిశ్రీ పట్టుచీర… డోర్‌ వద్ద ఉన్న ఇనుప రేకుకు తగిలి చిరిగిపోయింది. మరో మహిళ చీర కూడా అదే తరహాలో చిరిగిపోయింది. ఈ విషయాన్ని వాణిశ్రీ దంపతులు డ్రైవర్‌కు వివరించగా… అతడి నుంచి సరైన సమాధానం రాలేదు.

రేకు సరిచేసే పని తనది కాదని, డిపో సిబ్బంది ఆ పని చేస్తారంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో వాణిశ్రీ వినియోగదారుల ఫోరంలో కేసు వేసింది. విచారణ జరిపిన నల్లగొండలోని వినియోగదారుల ఫోరం … వాణి శ్రీ చీర చిరిగిపోవడానికి ఆర్టీసీ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. మూడు వేల రూపాయలు వాణిశ్రీకి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News