సచిన్ రికార్డును చెరిపేసిన కుర్రాడు
నేపాల్ కుర్రాడు సచిన్ రికార్డును సవరించాడు. 29 ఏళ్ల క్రితం సచిన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతి తక్కువ వయసులో ఆఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటి వరకు సచిన్ పేరు మీద రికార్డు ఉండేది. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఆఫ్ సెంచరీ చేశాడు. అప్పుడు సచిన్ వయసు కేవలం 16 ఏళ్ల 213 రోజులు. నేపాల్‌కు చెందిన రోహిత్ పాడెల్ ఈ రికార్డును పడగొట్టాడు. యూఏఈతో […]
నేపాల్ కుర్రాడు సచిన్ రికార్డును సవరించాడు. 29 ఏళ్ల క్రితం సచిన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతి తక్కువ వయసులో ఆఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటి వరకు సచిన్ పేరు మీద రికార్డు ఉండేది.
సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఆఫ్ సెంచరీ చేశాడు. అప్పుడు సచిన్ వయసు కేవలం 16 ఏళ్ల 213 రోజులు. నేపాల్‌కు చెందిన రోహిత్ పాడెల్ ఈ రికార్డును పడగొట్టాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ పాడెల్ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు.
ప్రస్తుతం రోహిత్ వయసు 16ఏళ్ల 146 రోజులే. దీంతో అతి చిన్న వయసులో ఆఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ పాడెల్ నిలిచారు. అయితే మహిళా క్రికెట్‌లో మాత్రం 14 ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికాకు చెందిన జొమరి లాగ్టెన్ బర్గ్ అటు టెస్ట్, ఇటు వన్డే క్రికెట్‌లో ఆఫ్ సెంచరీ చేసింది.