అన్న ప్రతిపాదన నచ్చలేదు.. నేను వైసీపీలో చేరుతున్నా...

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు వైసీపీకి జై కొట్టారు. కర్నూలు జిల్లా కోడుమూరులో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తన అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ అక్రమాలను ఎదురించి పోరాడే శక్తి వైసీపీకి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే అందరం కలిసి వైసీపీలో చేరుదామని పిలుపునిచ్చారు. ఇతర పార్టీలతో జతకట్టి రాజకీయం చేద్దామంటూ తన సోదరుడు […]

Advertisement
Update:2019-01-27 12:06 IST

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు వైసీపీకి జై కొట్టారు. కర్నూలు జిల్లా కోడుమూరులో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తన అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ అక్రమాలను ఎదురించి పోరాడే శక్తి వైసీపీకి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే అందరం కలిసి వైసీపీలో చేరుదామని పిలుపునిచ్చారు.

ఇతర పార్టీలతో జతకట్టి రాజకీయం చేద్దామంటూ తన సోదరుడు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి చేసిన ప్రతిపాదన తన మనసు నొచ్చుకునేలా చేసిందన్నారు. రాజకీయంగా శాశ్వత శత్రువుగా ఉన్న టీడీపీతో అనైతిక స్నేహాలు తనకు నచ్చలేదన్నారు. టీడీపీతో చేతులు కలిపేందుకు తన ఆత్మాభిమానం అడ్డువచ్చిందన్నారు.

ఏపీలో టీడీపీ- కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరితే పొత్తులో భాగంగా కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భావించారు. కానీ పొత్తు ఉండదని కాంగ్రెస్‌ ప్రకటించడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ప్రకటించిన సమావేశం నుంచి ఆయన ఇటీవల అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. నేరుగా టీడీపీలో చేరేందుకే సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిర్ణయాన్ని కుటుంబసభ్యులే వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

Similar News