ఎన్నికల్లో వైరం.... ప్రభుత్వంతో స్నేహం
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార పక్షంతో సహా ప్రతిపక్షాలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునక లవుతున్నాయి. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ లను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు. భారతీయ జనతా పార్టీతో అయితే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ ను నిలువరించాలంటే పవన్ కళ్యాణ్ తో స్నేహం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు […]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార పక్షంతో సహా ప్రతిపక్షాలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునక లవుతున్నాయి. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ లను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు.
భారతీయ జనతా పార్టీతో అయితే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ ను నిలువరించాలంటే పవన్ కళ్యాణ్ తో స్నేహం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరుగుతున్నారు.
ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేయడం కంటే ఎన్నికల అనంతరం పరిస్థితి బేరీజు వేసుకుని పవన్ కళ్యాణ్ తో స్నేహం చేయాలని చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే పవన్ కళ్యాణ్ ను తమ వైపు తిప్పుకుని తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారట. ఈ వ్యూహాన్ని అమలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ తో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.