న్యూజిలాండ్ తో రెండోవన్డేలోనూ టీమిండియా హిట్
పాంచ్ పటాకా సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం న్యూజిలాండ్ పై టీమిండియా 90 పరుగుల భారీ విజయం టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగులు న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో …టీమిండియా వరుసగా రెండో విజయంతో 2-0 ఆధిక్యత సంపాదించింది. బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో టీమిండియా 90 పరుగులలభారీతేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఈమ్యాచ్ […]
- పాంచ్ పటాకా సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం
- న్యూజిలాండ్ పై టీమిండియా 90 పరుగుల భారీ విజయం
- టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగులు
- న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్
న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో …టీమిండియా వరుసగా రెండో విజయంతో 2-0 ఆధిక్యత సంపాదించింది.
బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో టీమిండియా 90 పరుగులలభారీతేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగుల భారీస్కోరు సాధించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 154 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత భారీస్కోరులో ప్రధానపాత్ర వహించారు. సమాధానంగా 325 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ టాపార్డర్ టపటపా రాలిపోయింది.
40.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, చాహల్, భువీ చెరో రెండు వికెట్లు షమీ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
రోహత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని మూడో వన్డే బే ఓవల్ వేదికగా ఈనెల 29న జరుగుతుంది.