ప్రియాంక కేవలం పిల్లల కోసమే రాజకీయాల్లోకి రాలేకపోయింది

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ ప్రియాంకా గాంధీ వాద్రా గురించి తన సోదరుడు కొన్ని విషయాలు పంచుకున్నారు. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం విషయం త్వరపడి తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని పది రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నామని… తనతో పలు మార్లు చర్చించిన తర్వాతే ఈ విషయం బయటకు వెల్లడించామని రాహుల్ చెప్పారు. తన సహోదరి ప్రియాంక ఎప్పుడో రాజకీయాల్లో ఎంట్రీ […]

Advertisement
Update:2019-01-25 12:03 IST

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ ప్రియాంకా గాంధీ వాద్రా గురించి తన సోదరుడు కొన్ని విషయాలు పంచుకున్నారు. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం విషయం త్వరపడి తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని పది రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నామని… తనతో పలు మార్లు చర్చించిన తర్వాతే ఈ విషయం బయటకు వెల్లడించామని రాహుల్ చెప్పారు.

తన సహోదరి ప్రియాంక ఎప్పుడో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ, తన పిల్లల బాగోగులు చూడటానికి ఇంటికే పరిమితమయ్యిందని రాహుల్ అన్నారు. ఇప్పుడు ప్రియాంక పిల్లలు పెరిగి పెద్దయ్యారని…. అందుకే ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్ స్పష్టం చేశారు.

నాకు, ప్రియాంకకు విభేదాలు వచ్చాయని మీడియాలో ప్రచారం చేశారు కానీ తనకు నాకు చాలా దగ్గరి అనుబంధం ఉందని రాహుల్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News