న్యూజిలాండ్ తో రెండో వన్డేకి టీమిండియా రెడీ
బే ఓవల్ స్టేడియానికి చేరిన పాంచ్ పటాకా షో తొలివన్డే గెలుపుతో టీమిండియా జోష్ తొలి దెబ్బతో రగిలిపోతున్న న్యూజిలాండ్ ఉదయం 7-30 నుంచి మ్యాచ్ ప్రారంభం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ షో…. నేపియర్ నుంచి…సెయింట్ మాంగునీ బే ఓవల్ స్టేడియానికి చేరింది. రిపబ్లిక్ డే స్పెషల్ గా జరుగనున్న ఈ పోటీలో సైతం…. రెండుజట్లూ…. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. రెండోర్యాంకర్ టీమిండియా మరోసారి హాట్ ఫేవరెట్ గా వరుసగా రెండో విజయానికి […]
- బే ఓవల్ స్టేడియానికి చేరిన పాంచ్ పటాకా షో
- తొలివన్డే గెలుపుతో టీమిండియా జోష్
- తొలి దెబ్బతో రగిలిపోతున్న న్యూజిలాండ్
- ఉదయం 7-30 నుంచి మ్యాచ్ ప్రారంభం
టీమిండియా-న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ షో…. నేపియర్ నుంచి…సెయింట్ మాంగునీ బే ఓవల్ స్టేడియానికి చేరింది. రిపబ్లిక్ డే స్పెషల్ గా జరుగనున్న ఈ పోటీలో సైతం…. రెండుజట్లూ…. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
రెండోర్యాంకర్ టీమిండియా మరోసారి హాట్ ఫేవరెట్ గా వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. రేపు ఉదయం 7-30 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.
టీమిండియా టాప్ గేర్….
నేపియర్ వేదికగా ముగిసిన తొలివన్డేలో అలవోకగా నెగ్గిన జోష్ తో టీమిండియా వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తుంటే… మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ మాత్రం తొలిదెబ్బతో… లోపాలు సవరించుకొనే పనిలో పడింది.
రాయుడికి మరో చాన్స్….
ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు… తొలివన్డేలో తడబాటు పడిన …తెలుగుతేజం అంబటి రాయుడికి…మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. వివాదాస్పద ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా.… సెలక్షన్ కు అందుబాటులో ఉన్నా…విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించే అవకాశం ఉంది.
అంతేకాదు…బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యంత సమతూకంతో ఉన్న టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో సమరానికి సిద్ధమయ్యింది. మరోవైపు…ఆతిథ్య న్యూజిలాండ్ మాత్రం…తన తుదిజట్టులో లెగ్ స్పిన్నర్ ఇష్ సోథీకి చోటు కల్పించాలని నిర్ణయించింది.
మ్యాచ్ కు వేదికగా ఉన్న బే ఓవల్ లో సోథీకి మెరుగైన రికార్డు ఉండడంతో…ఆల్ రౌండర్ టిమ్ సౌథీకి బదులుగా అవకాశం కల్పించనుంది.
అందాల క్రికెట్ వేదిక బే ఓవల్….
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా…ఆడిన గత ఐదు వన్డేల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమి రికార్డుతో ఉంటే….కేన్ విలియమ్స్ సన్ కెప్టెన్సీలోని కివీస్ జట్టు గత ఐదు వన్డేల్లో… మూడు విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉంది.
ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బే ఓవల్ స్టేడియానికి…ప్రపంచంలోని అత్యంత సుందరమైన క్రికెట్ వేదికల్లో ఒకటిగా పేరుంది.
ఫసిఫిక్ మహాసముద్ర తీరంలో…అగ్నిపర్వతాల ద్వీపకల్పంలో ఉన్న మౌంట్ మాగునీలోని బే ఓవల్ స్టేడియాన్ని…10 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించారు. గత అక్టోబర్ లోనే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కు వేదికగా నిలిచిన బే ఓవల్ కు హైస్కోరింగ్ మ్యాచ్ లకు చిరునామాగా పేరుంది.
భారీస్కోర్ల అడ్డా…..
ఈ గ్రౌండ్ లో 300 స్కోర్లు నమోదు కావడం సాధారణ విషయం. ప్రస్తుత వన్డే సైతం హైస్కోరింగ్ ఫైట్ గా జరిగే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే బే ఓవల్ వికెట్ పై…. టాస్ నెగ్గిన జట్టు…. ముందుగా బ్యాటింగ్ చేయటానికే ఆసక్తి చూపే అవకాశం ఉంది.
భారత గణతంత్ర దినోత్సవం రోజున జరుగుతున్న ఈ మ్యాచ్… ఉదయం 7 గంటల 30 నిముషాలకు ప్రారంభమవుతుంది. తొలివన్డే విన్నర్ టీమిండియానే మరోసారి హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.