ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో బన్నీ

 “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” సినీమా ఫ్లాప్ తరువాత దాదాపు ఏడు నెలల పాటు గ్యాప్ తీసుకున్న బన్నీ ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసాడు. త్రివిక్రమ్ ఇంకా బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు బన్నీ తో పూర్తి స్థాయి లవ్ స్టొరీ ని తెరకెక్కించని త్రివిక్రమ్ ఈ సారి మాత్రం బన్నితో ఒక ఎమోషనల్ లవ్ స్టొరీ ని తీయబోతున్నాడు. […]

Advertisement
Update:2019-01-25 03:37 IST

“నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” సినీమా ఫ్లాప్ తరువాత దాదాపు ఏడు నెలల పాటు గ్యాప్ తీసుకున్న బన్నీ ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసాడు.

త్రివిక్రమ్ ఇంకా బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు బన్నీ తో పూర్తి స్థాయి లవ్ స్టొరీ ని తెరకెక్కించని త్రివిక్రమ్ ఈ సారి మాత్రం బన్నితో ఒక ఎమోషనల్ లవ్ స్టొరీ ని తీయబోతున్నాడు. ఈ సినిమా కథ మొత్తం పూర్తి చేసిన త్రివిక్రమ్ వచ్చేనెల రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తాడట.

“భరత్ అనే నేను” “వినయ విధేయ రామ” వంటి సినిమాలతో హీరోయిన్ గా ఆకట్టుకున్న కైరా అద్వానీ ఈ సినిమాలో బన్ని సరసన నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్, హారిక హాసిని క్రియేషన్స్ పై ఎస్.రాధా క్రిష్ణ సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News