ఈ వైఎస్‌ కొండారెడ్డి ఎవరబ్బా...?!

అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు జరుగుతోంది. ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎంపీ మిథున్ రెడ్డి…. రెండు రోజులుగా జిల్లాలోనే మకాం వేసి నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కదిరి అభ్యర్ధిని ప్రకటించారు. మరికొందరి పేర్లను దాదాపు ఖరారు చేశారు. ఇంతలో హఠాత్తుగా జగన్‌ బంధువు వైఎస్‌ కొండా రెడ్డి అభ్యర్థుల ప్రకటనలో జోక్యం చేసుకోవడం వైసీపీలో కాకరేపుతోంది. పార్టీలో ఏ పదవి లేని వైఎస్ కొండారెడ్డి జోక్యం చేసుకోవడం పట్ల పార్టీ నేతలు కూడా […]

Advertisement
Update:2019-01-23 03:00 IST

అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు జరుగుతోంది. ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎంపీ మిథున్ రెడ్డి…. రెండు రోజులుగా జిల్లాలోనే మకాం వేసి నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కదిరి అభ్యర్ధిని ప్రకటించారు. మరికొందరి పేర్లను దాదాపు ఖరారు చేశారు.

ఇంతలో హఠాత్తుగా జగన్‌ బంధువు వైఎస్‌ కొండా రెడ్డి అభ్యర్థుల ప్రకటనలో జోక్యం చేసుకోవడం వైసీపీలో కాకరేపుతోంది. పార్టీలో ఏ పదవి లేని వైఎస్ కొండారెడ్డి జోక్యం చేసుకోవడం పట్ల పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అన్న తర్వాత ఒక పద్దతిని పాటించాలని… అలా కాకుండా ఏ పదవి లేని వైఎస్ కొండారెడ్డి నేరుగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏ హోదా లేనప్పటికీ జగన్ బంధువు హోదాలో హిందూపురం వచ్చిన వైఎస్ కొండారెడ్డి స్థానికంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. హిందూపురం అభ్యర్థిగా ఇటీవలే టీడీపీ నుంచి వచ్చిన అబ్దుల్ ఘని పేరును కొండారెడ్డి ప్రకటించారు.

దీంతో ఇప్పటి వరకు పార్టీకి సేవ చేస్తూ వచ్చిన నవీన్ నిశ్చల్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభ్యర్థిని ప్రకటించడానికి కొండారెడ్డికి ఉన్న హోదా ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చాలా కీలకమైన ఇలాంటి విషయాలను కేవలం జగన్‌కు బంధువులం అన్న హోదాలో ప్రకటిస్తే ఇక పార్టీ నిర్మాణానికి, వ్యవస్థకు విలువేం ఉంటుందని పలువురు వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి విషయాల్లో బంధువుల జోక్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. వైఎస్ కొండారెడ్డి నిర్వహించిన సమావేశానికి హిందూపురానికి చెందిన స్థానిక వైసీపీ నేతలెవ్వరూ హాజరు కాలేదు. అబ్దుల్‌ ఘనితో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారే కొండారెడ్డి వెంట తిరిగారు.

Advertisement

Similar News