టీడీపీ- జనసేన పొత్తుపై సంచలన ప్రకటన

టీడీపీ- జనసేన తిరిగి దగ్గరవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ సంచలన ప్రకటన చేశారు. పవన్‌ కల్యాణ్- టీడీపీ కలిస్తే జగన్‌కు ఏంటి బాధ అని ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా… టీజీ వెంకటేశ్‌ మరో అడుగు ముందుకేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని చెప్పారు. పొత్తుకు అవకాశాలు అత్యధికంగా ఉన్నాయన్నారు.  మార్చిలో చర్చలు జరుగుతాయన్నారు. చర్చలంటే సీట్ల సర్దుబాటు కోసమేనని వివరణ కూడా ఇచ్చారు టీజీ వెంకటేశ్‌. పవన్‌ కల్యాణ్‌కు […]

Advertisement
Update:2019-01-23 07:55 IST

టీడీపీ- జనసేన తిరిగి దగ్గరవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ సంచలన ప్రకటన చేశారు. పవన్‌ కల్యాణ్- టీడీపీ కలిస్తే జగన్‌కు ఏంటి బాధ అని ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా… టీజీ వెంకటేశ్‌ మరో అడుగు ముందుకేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని చెప్పారు. పొత్తుకు అవకాశాలు అత్యధికంగా ఉన్నాయన్నారు. మార్చిలో చర్చలు జరుగుతాయన్నారు. చర్చలంటే సీట్ల సర్దుబాటు కోసమేనని వివరణ కూడా ఇచ్చారు టీజీ వెంకటేశ్‌.

పవన్‌ కల్యాణ్‌కు టీడీపీతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం వైఖరి విషయంలోనే చంద్రబాబు, పవన్‌ మధ్య విభేదాలు వచ్చాయన్నారు. కేంద్రంపై చంద్రబాబు గట్టిగా పోరాడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది అన్నది పవన్ కల్యాణ్ అభిప్రాయం అని.. ఇప్పుడు ఎలాగూ చంద్రబాబు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ సమస్య కూడా లేదన్నారు.

ముఖ్యమంత్రి పీఠం పై వెంటనే కూర్చోవాలన్న ఆశ తనకు లేదని పవన్‌ కల్యాణ్ కూడా చెప్పారని గుర్తు చేశారు. యూపీలో బద్ధశత్రువులైన ఎస్పీ, బీఎస్పీలే కలిసినప్పుడు ఇక్కడ పవన్‌, చంద్రబాబు కలవడంతో ఆశ్చర్యం ఏముంటుందని ప్రశ్నించారు. పొత్తుపై రెండు పార్టీల్లోని కార్యకర్తలు, నాయకులు సదాభిప్రాయంతో ఉన్నారని టీజీ వివరించారు.

Tags:    
Advertisement

Similar News