రిజర్వేషన్ల భారతం

దేశంలో రిజర్వేషన్ల హోరు పెరుగుతోంది. రానున్న ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం అన్ని పార్టీలు రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. దీనిని అస్త్రంగా చేసుకుని  రానున్న ఎన్నికలలో విజయం సాధించాలని బిజేపీ భావిస్తోంది. ఇప్పటికే బలహీన వర్గాలలో బిజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి బయటపడేందుకు రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ప్రయోగం సత్ఫలితాలు […]

Advertisement
Update:2019-01-23 06:50 IST

దేశంలో రిజర్వేషన్ల హోరు పెరుగుతోంది. రానున్న ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం అన్ని పార్టీలు రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. దీనిని అస్త్రంగా చేసుకుని రానున్న ఎన్నికలలో విజయం సాధించాలని బిజేపీ భావిస్తోంది.

ఇప్పటికే బలహీన వర్గాలలో బిజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి బయటపడేందుకు రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా పార్టీ వర్గాలకు సమాచారం అందుతోంది. రానున్న ఎన్నికలలో రిజర్వేషన్ల అస్త్రంతో విజయం సాధిస్తామన్న ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది.

అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రిజర్వేషన్ల అస్త్రానే తామూ ప్రయోగించాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు 25 శాతం అదనపు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రస్తుత రిజర్వేషన్లతో పాటు బిజేపీ ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే అది 59.5 శాతం అవుతుంది. దీనికి కాంగ్రెస్ రిజర్వేషన్లు కూడా జత కలిస్తే 85 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బిజేపీ ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లను ఎదుర్కుని నిలబడాలంటే కాంగ్రెస్ కూడా రిజర్వేషన్లు ప్రకటించాల్సిందేనని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

ఈ ఎన్నికలలో విజయం సాధించడం అనివార్యం అయిన సందర్భలో కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటోందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News