న్యూజిలాండ్ గడ్డపై టీమిండియాకు అంతంత మాత్రం రికార్డు

1976 నుంచి న్యూజిలాండ్ వేదికగా భారత్ తో వన్డే సిరీస్ లు న్యూజిలాండ్ గడ్డపై 7 సిరీస్ ల్లో భారత్ కు ఒక్కటే గెలుపు ఓవరాల్ గా రెండుజట్ల మధ్య 34 వన్డేలు భారత్ 10, న్యూజిలాండ్ 21 వన్డేల్లో గెలుపు స్వదేశంలో పులిలాంటి న్యూజిలాండ్ తో…అసలు సిసలు వన్డే సిరీస్ సమరానికి టీమిండియా సై అంటోంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని రెండోర్యాంకర్ టీమిండియా నేలవిడిచి సాము చేయటానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. అయితే…. కివీగడ్డపై ఆడిన సిరీస్ ల్లో […]

Advertisement
Update:2019-01-22 15:09 IST
  • 1976 నుంచి న్యూజిలాండ్ వేదికగా భారత్ తో వన్డే సిరీస్ లు
  • న్యూజిలాండ్ గడ్డపై 7 సిరీస్ ల్లో భారత్ కు ఒక్కటే గెలుపు
  • ఓవరాల్ గా రెండుజట్ల మధ్య 34 వన్డేలు
  • భారత్ 10, న్యూజిలాండ్ 21 వన్డేల్లో గెలుపు

స్వదేశంలో పులిలాంటి న్యూజిలాండ్ తో…అసలు సిసలు వన్డే సిరీస్ సమరానికి టీమిండియా సై అంటోంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని రెండోర్యాంకర్ టీమిండియా నేలవిడిచి సాము చేయటానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది.

అయితే…. కివీగడ్డపై ఆడిన సిరీస్ ల్లో మాత్రం టీమిండియాకు అంతంత మాత్రం రికార్డే ఉంది. ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ కు ముందు వరకూ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు ఓసారి చూద్దాం…

టీమిండియా టాప్ గేర్….

వన్డే క్రికెట్ రెండోర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టీమిండియా…విదేశీ గడ్డపై అతిపెద్ద సమరానికి సిద్ధమయ్యింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ట్విన్ సిరీస్ లో భాగంగా… కివీస్ తో జరిగే పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో విజయమే లక్ష్యంగా…విరాట్ అండ్ కో పోటీకి దిగుతున్నారు.

స్వదేశంలో తిరుగులేని కివీస్…..

అయితే…1976 నుంచి 2014 వరకూ న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా ఆడిన సిరీస్ ల్లో అంతంత మాత్రం రికార్డే ఉంది. మొత్తం ఏడు సిరీస్ ల్లో టీమిండియా ఒక్క సిరీస్ మాత్రమే నెగ్గిందంటే… తమ దేశంలో న్యూజిలాండ్ ఎంత పటిష్టమైనదో …ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే…టీమిండియా రెండు, న్యూజిలాండ్ మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండుజట్ల ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ …ఉత్కంఠభరితంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది.

1976లో తొలి ద్వైపాక్షిక సిరీస్…

న్యూజిలాండ్ గడ్డపై 1976 నుంచి భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ వస్తోంది. 2014 వరకూ ఆడిన మొత్తం ఏడు సిరీస్ ల్లో భారత్ ఒకే ఒక్కసారి విజేతగా నిలిచింది. 1976 సిరీస్ లో 0-2తో పరాజయం పొందిన భారత్ కు…1991 సిరీస్ లో సైతం అదే ఫలితం ఎదురయ్యింది.

1994 లో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసి సత్తా చాటుకొంది. అంతేకాదు…1999 సిరీస్ ను 2-2తో సమం చేయగలిగింది. 2002-03 జరిగిన ఏడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ కు 2-5తో భారీ ఓటమి తప్పలేదు.

2009లో భారత్ తొలి సిరీస్ గెలుపు….

2009 సిరీస్ లో భారత్ తొలిసారిగా న్యూజిలాండ్ పై 2-1తో విజేతగా నిలిచింది. కివీ గడ్డపై భారత్ కు ఇదే తొలి సిరీస్ విజయం కావటం విశేషం.

ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్ వేదికగా ముగిసిన ఐదుమ్యాచ్ లో సిరీస్ లో ఓమ్యాచ్ ను టైగా ముగించిన భారత్…మిగిలిన నాలుగు వన్డేల్లోనూ పరాజయాలు చవిచూసింది. చివరకు 0-4తో సిరీస్ ను చేజార్చుకొంది.

ఓవరాల్ గా ఈ రెండుజట్ల మథ్య… న్యూజిలాండ్ గడ్డపై జరిగిన 7 సిరీస్ ల్లో కివీటీమ్ నాలుగు సిరీస్ విజయాలు సాధిస్తే…. రెండు సిరీస్ లు డ్రాగా ముగిసాయి. ఓ సిరీస్ లో మాత్రమే భారత్ విజేతగా నిలిచింది.

కివీస్ తో 34 వన్డేల్లో 10 విజయాలు….

ఈ రెెండుజట్ల మధ్య జరిగిన వన్డే ల్లో సైతం…న్యూజిలాండ్ ఆధిక్యమే కనిపిస్తుంది. న్యూజిలాండ్ తో భారత్ మొత్తం 34 వన్డేల్లో తలపడితే… పది విజయాలు సాధించి…21 పరాజయాలు చవిచూసింది.

ఓ మ్యాచ్ టైగా ముగియగా…మరో రెండు వన్డేలు ఫలితం తేలకుండానే రద్దులపద్దులో చేరిపోయాయి.

హాట్ ఫేవరెట్ టీమిండియా….

ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ లో మాత్రం…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరిగే..ఈ పాంచ్ పటాకా సిరీస్ ఎంత పట్టుగా సాగుతుందో…. టీమిండియాకు న్యూజిలాండ్ ఏస్థాయి లో పోటీ ఇవ్వగలదన్నది… ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News