డీఈవో సంచలన ఆదేశాలు.... జాతీయ జెండా ఆవిష్కరణలో పూజ సామాగ్రి వాడొద్దు
మరో నాలుగు రోజుల్లో గణతంత్ర వేడుకలు జరుగనున్న తరుణంలో అదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి. పాఠశాలల్లో జెండా ఆవిష్కరించే సమయంలో పాటించవలసిన నియమ, నిబంధనలను ఈ ఉత్తర్వుల్లో పొందు పరిచారు. జెండా ఆవిష్కరణ సమయంలో ఎలాంటి పూజలు చేయ వద్దని, కొబ్బరికాయలు కొట్టడం.. పూలమాలలు వేయడం.. పసుపుకుంకుమ పెట్టడం చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాకుండా పూజా సామాగ్రిని వాడకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ […]
మరో నాలుగు రోజుల్లో గణతంత్ర వేడుకలు జరుగనున్న తరుణంలో అదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి. పాఠశాలల్లో జెండా ఆవిష్కరించే సమయంలో పాటించవలసిన నియమ, నిబంధనలను ఈ ఉత్తర్వుల్లో పొందు పరిచారు.
జెండా ఆవిష్కరణ సమయంలో ఎలాంటి పూజలు చేయ వద్దని, కొబ్బరికాయలు కొట్టడం.. పూలమాలలు వేయడం.. పసుపుకుంకుమ పెట్టడం చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాకుండా పూజా సామాగ్రిని వాడకూడదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతీ పాఠశాలలో తప్పని సరిగా డాక్టర్ బీఆర్ అంబేత్కర్, మహాత్మా గాంధీ ఫొటోలకు మాత్రం పూల మాల వేసి సత్కరించాలని తెలిపారు. ఈ ఆదేశాలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.