ఖబర్దార్‌... ఓపిక నశించింది " జేసీకి వార్నింగ్

అనంతపురం టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నా సరే అధిపత్యపోరులో అటు ఎంపీ జేసీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వెనక్కు తగ్గడం లేదు. గతంలో పలుమార్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న నేతలు తాజాగా మరోసారి మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ సారి వివాదానికి రాంనగర్ లో నిర్మించిన ఫైఓవర్‌ కారణమైంది. పెండింగ్‌లో ఉన్న ఈ ఫైఓవర్‌ కాంట్రాక్టును జేసీ దక్కించుకుని పూర్తి చేశారు. ఇప్పుడు దీన్ని తానే స్వయంగా ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. […]

Advertisement
Update:2019-01-21 02:06 IST

అనంతపురం టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నా సరే అధిపత్యపోరులో అటు ఎంపీ జేసీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వెనక్కు తగ్గడం లేదు. గతంలో పలుమార్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న నేతలు తాజాగా మరోసారి మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ సారి వివాదానికి రాంనగర్ లో నిర్మించిన ఫైఓవర్‌ కారణమైంది.

పెండింగ్‌లో ఉన్న ఈ ఫైఓవర్‌ కాంట్రాక్టును జేసీ దక్కించుకుని పూర్తి చేశారు. ఇప్పుడు దీన్ని తానే స్వయంగా ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కూడా ఆహ్వానించలేదు. పైగా ప్రభాకర్ చౌదరిపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చౌదరికి కోపం వచ్చింది. జేసీకి వార్నింగ్ ఇచ్చారు.

”నా జోలికి వస్తే ఖబర్దార్‌. నా ఓపిక నశించిపోతోంది. అందరి అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాననే నోరు విప్పడం లేదు. రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి” అంటూ జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్ చౌదరి.

కాంట్రాక్టు తీసుకున్నంత మాత్రాన ఫ్లైఓవర్‌పై హక్కులన్నీ వచ్చేస్తాయా అని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. ఫ్లైఓవర్‌ను ఎంపీ ప్రారంభించాల్సిన అవసరం లేదని… ముఖ్యమంత్రే వచ్చి ప్రారంభిస్తారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫైఓవర్‌ను ఎవరు ప్రారంభిస్తారన్న దానిపై టీడీపీలో చర్చ నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News